Mobile Internet Speed : ప్రస్తుత, సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువ అయింది. అయితే, మనలో చాలా మంది ఫోన్ వినియోగించే సమయంలో ఇంటర్నెట్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం :
ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలతో పాటు అనేక రకాల టెక్నికల్ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు. మీ ఫోన్‌ని ఆఫ్ చేసి, కాసేపు ఉంచి మళ్ళీ ఆన్ చేసే చేయండి. ఫోన్ లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తొలగించడంలో సహాయపడుతుంది. మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని రిఫ్రెష్ చేస్తుంది. మీరు ఫోన్‌ని రీసెట్ చేయదలచుకుంటే, నెట్‌వర్క్ కనెక్టివిటీని రీస్టార్ట్ చేయడానికి మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు.
కాష్ క్లియర్ చేయడం :
ఇంటర్నెట్ స్లో గా ఉండటానికి ప్రధాన కారణం క్యాచ్ కావచ్చు. కాష్ మెమరీ ఫుల్ అయినప్పుడు, మీ ఫోన్ స్లో అవుతుంది. కాబట్టి, కనీసం వారానికి ఒకసారి మీ ఫోన్‌ని స్కాన్ చేయండి. ఈ స్కాన్ అవసరం లేని ఫైల్‌లు మరియు కాష్‌ల వివరాలను చూపిస్తుంది. వాటిని రిమూవ్ చేయడం వల్ల మీ ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. నెట్ స్పీడ్ పెరుగుతుంది. ఈ స్కాన్ కోసం, ప్లే స్టోర్‌లో అనేక స్మార్ట్ ఫోన్ క్లీనప్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు :
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు, మీ నెట్‌వర్క్ స్పీడ్ ని తగ్గించవచ్చు. సెట్టింగ్‌ల మెనులో, యాప్ ఎంత డేటాను ఉపయోగిస్తుందో చెక్ చేసి డేటా వినియోగాన్ని పరిమితం చేయండి. మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్‌ల కోసం మీరు నెట్‌వర్క్ స్పీడ్ కి ప్రయారిటీ ఇవ్వవచ్చు.
యాప్‌లను అప్‌డేట్ చేయడం:
ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోతే ఫోన్ నెట్‌వర్క్ స్పీడ్ తగ్గవచ్చు. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌గా ఉంచకపోతే ఇంటర్నెట్ స్పీడ్ ని తగ్గడమే కాకుండా ఫోన్ పనితీరుకి కూడా ఇబ్బందులు వస్తాయి.
ఆటో అప్‌డేట్.
ఆటోమేటిక్ అప్‌డేట్‌ల వల్ల ఎక్కువ డేటా అయిపోతుంది. దాంతో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్లో గా ఉంటే, ఆటోమేటెడ్ యాప్ అప్‌డేట్‌లను ఆఫ్ చేయండి. ఇంటర్నెట్ సరిగ్గా పని చేస్తున్నప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. Wi-Fi ఉన్నప్పుడు మాత్రమే అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
యాప్ క్యాచ్ క్లియర్ చేయడం:
పర్సనల్ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఆండ్రాయిడ్ సిస్టమ్ ఫోన్‌లలోని యాప్‌లలో డేటా పెరుగుతూ ఉంటుంది. దాంతో మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. మీ వెబ్ బ్రౌజర్‌లో తరచుగా ఉపయోగించే యాప్‌ల కాష్‌ను క్రమం తప్పకుండా క్లియర్ చేస్తే స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా, మీ బ్రౌజర్‌లో యాప్‌లు లేదా వెబ్ బ్రౌజర్ లు ఓపెన్ లో ఉంటే, అనవసరమైన డేటా వినియోగాన్ని సేవ్ చేయడానికి వాటిని క్లోజ్ చేయడం మంచిది.