Mobile Lost: మీ ఫోన్ పోయిందా? టెన్షన్ వద్దు, ఇలా చేస్తే సరిపోతుంది

చాలా మంది ఫోన్ లలో తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం, ఫోటోలు మరియు వీడియోలు వంటివి వారి స్మార్ట్‌ఫోన్‌లలో స్టోర్ చేసుకుంటారు. ఫోన్ పోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Mobile Lost: ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్మార్ట్ ఫోన్ వచ్చాక పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎడిక్ట్ అవుతున్నారు. ఇక చాలా మంది ఫోన్ లలో తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారం, ఫోటోలు మరియు వీడియోలు వంటివి వారి స్మార్ట్‌ఫోన్‌లలో స్టోర్ చేసుకుంటారు. అయితే, స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు టెన్షన్ కి గురి అవుతూ ఉంటాం. ఎక్కువగా పోలీసులకు పిర్యాదు చేస్తూ ఉంటారు. లేదంటే ఇక ఫోన్ పై ఆశ వదులుకుంటారు. అయితే, మీ స్మార్ట్‌ఫోన్ పోయినా, ఎవరి చేతనైన దొంగలించినా..ఇకపై దిగులు చెందాల్సిన అవసరం లేదు. మరి ఇంతకీ పోయిన ఫోన్ ను తిరిగి ఎలా పొందాలి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ ఆండ్రాయిడ్ పరికరాలలో ‘ఫైండ్ మై డివైజ్’ అనే ఫీచర్‌ ఉంటుంది. ఇది మీ ఫోన్ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తిస్తుంది. దీని ద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. మీ ఫోన్ ని ఎవరైనా దొంగిలిస్తే, దాన్ని ఎలా ట్రేస్ చేయాలో తెలుసుకుందాం.

ముందుగా, కస్టమర్‌ (Customer)లు ల్యాప్‌టాప్ (Laptop) , PC లేదా ఇతర ఫోన్‌లో వారి గూగుల్ అకౌంట్ (Google Account)ను ఉపయోగించి “ఫైండ్ మై డివైజ్” (Find My Device) ను తప్పనిసరిగా చెక్ ఇన్ చేయాలి.

ఆపై, “ఫైండ్ మై డివైజ్” ఉపయోగించి, మీ ఫోన్ లొకేషన్ ను ట్రేస్ (Trace) చేసి మ్యాప్‌లో మీ మొబైల్ ఎక్కడ ఉందొ చూడవచ్చు. ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి మూడు ఆప్షన్ లు ఉంటాయి. మొదటిది సౌండ్ ప్లే (Sound Play) , రెండవది సెక్యూర్ డివైజ్, మూడవది డేటా ఎరేజర్.

మీరు సౌండ్ ప్లే ఆప్షన్‌ని ఎంచుకుంటే, ఫోన్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే, అది సైలెంట్‌ (Silent) లో ఉన్నా దాదాపు 5 నిమిషాల పాటు రింగ్ అవుతుంది.

ఇంకా, స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాన్ని లాక్ చేయవచ్చు మరియు ఎవరైనా ఫోన్‌ను కనుగొంటే, వారు ఫోన్‌లో మెసేజ్ ద్వారా సమాచారాన్ని పంపుకోవచ్చు. మీరు మీ గూగుల్ అకౌంట్ ను సైన్ అవుట్ చేసినప్పటికీ, ఫోన్ లొకేషన్ మ్యాప్‌లో కనిపిస్తుంది.

వెబ్సైట్ నుండి నేరుగా.

మీ ఫోన్ పోయిన సందర్భంలో, ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఇతరులు ఉపయోగించకుండా ఉండడానికి టెలికమ్యూనికేషన్స్ (Telecommunications) విభాగం ప్రత్యేక వెబ్‌పేజీ (Web Page) ని ఏర్పాటు చేసింది. ఈ పేజీలో మీ మొత్తం సమాచారాన్ని నమోదు చేసి బ్లాక్ చేయొచ్చు.
ముందుగా www.ceir.gov.in వెబ్‌సైట్‌ (Website) ను సందర్శించండి.
అక్కడ మీ ఫోన్ వివరాలను నమోదు చేయండి. అంతకంటే ముందు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలి.
ఆ తర్వాత, ఆ వెబ్‌సైట్‌ లో మీ IMEI నంబర్ మరియు FIR నంబర్‌ను నమోదు చేసి ఆన్‌లైన్ ఫారమ్‌ (Online Forum) ను పూరించండి.
మీ సెల్ ఫోన్ బ్లాక్ (Phone Block) అవుతుంది. ఇక, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఎవరూ యాక్సెస్ చేయలేరు.
మీ ఫోన్ దొరికాక, మీరు మళ్లీ దరఖాస్తు చేసుకొని దాన్ని అన్‌బ్లాక్ చేయవచ్చు.

Mobile Lost

Comments are closed.