Telugu Mirror : టొమాటో.. ఇప్పుడు ఈ పేరు దేశాన్ని పరుగులు పెట్టిస్తుంది.టొమాటో పేరు వింటూంటే ప్రజలు వణికి పోతున్నారు.ఇటీవల తనకు తెలీకుండా కూరలో రెండు టమోటాలు వేశాడని భర్తని వదిలేసి పిల్లలతో సహా వివాహిత అదృశ్యం. మరోచోట టమోటాలు అమ్మి వస్తున్న రైతు దగ్గర బాగా డబ్బు ఉంటుందని అడ్డగించి హత్య చేసిన దుండగులు తీరా చూస్తే ఆ రోజు, రైతు అమ్మిన సరుకు డబ్బులు మార్కెట్లో వసూలు చేయలేదు.
అతని జేబులో ఆరోజు అమ్మిన టమోటాల తాలూకు మార్కెట్ లో డబ్బులు ఇవ్వవలసిన వారి జాబితా ఉంది. ఒకరేమో టమోటాలకు కాపలాగా బౌన్సర్లను నియమించారు,మరొకరు టమోటాలు ఉన్న ప్రదేశంలో CC కెమెరాలను అమర్చారు. ఇలా టమోటా అనే పేరు ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. అయితే టమోటాలపై ప్రజలకు ఉన్న “క్రేజ్” ని కనిపెట్టిన చెంగల్ పట్టు లోని ఓ దుకాణ యజమాని,ప్రజల బలహీనతను బాగా “క్యాష్” చేసుకుంటున్నాడు.
Skin Tips:ఫేస్ ప్యాక్ లే కాదు ఇంటి చిట్కాలు కూడా ప్రకాశించే చర్మ సౌందర్యాన్ని ఇస్తాయి
కొత్త సెల్ ఫోన్ కొనుగోలు చేసేవారికి అలాగే యాక్ససరీస్ కొనే వారికి రెండు కిలోల టమోటాలు ఉచితం అని ప్రకటన చేయగానే కస్టమర్ ల నుండి అనూహ్య స్పందన వచ్చిందని చెంగల్పట్టులోని సెల్ ఫోన్ దుకాణం యజమాని తెలిపారు.
చెంగల్ పట్టు లోని రాతి నంగినారు ప్రాంతంలో సెల్ ఫోన్ లను అమ్మే దుకాణం నడుస్తోంది. ఈ సెల్ ఫోన్ విక్రయ కేంద్రం లో సెల్ ఫోన్లు మరియు సెల్ ఫోన్ కి సంభంధించిన విడి భాగాలు కొన్న వినియోగదారులకు 2 కిలోల టొమాటో ఉచితంగా అందజేస్తున్నారు.
Garlic Uses : రోజువారీ ఆహారంలో వెల్లుల్లి ప్రయోజనాలు.. తెలిస్తే వదిలి పెట్టరు..
గత కొంత కాలంగా టమోట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చెంగల్ పట్టు మార్కెట్ లో కిలో టమాటా వచ్చేసి రూ.130 కి అమ్ముడవుతున్నాయి. టమాటా ధరలు ప్రజలకు చుక్కల్ని చూపెడుతున్నాయి చెంగల్ పట్టు తో పాటు దేశం మొత్తం లో.దీనితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
వినియోగ దారులను ఆకర్షించేందుకు షాప్ యాజమాన్యం కొత్త సెల్ ఫోన్ లు ఖరీదు చేసే కస్టమర్ లకు అలానే యాక్ససరీలు కొనే వారికి ఉచితంగా 2 కిలోల టొమాటో లను అందజేస్తున్నారు.అంతే మొబైల్ స్టోర్ కి వచ్చే కొనుగోలుదారుల సంఖ్య అమితంగా పెరిగి పోయింది.