Parenting-Tips : మొక్కై వంగనిది మానై వంగునా..పిల్లల భద్రత పేరెంట్స్ చేతిలోనే..

Telugu Mirror : ప్రస్తుత బిజీ లైఫ్(Busy Life) లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా ఉంటారు .అలా ఉండటం వల్ల పిల్లల మనసుపై ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది.ఈ రోజుల్లో పిల్లల పెంపకం ఒక సవాలుగా మారింది. బిజీ లైఫ్ స్టైల్ దీనికి కారణం. కొంతమంది పేరెంట్స్ పిల్లలతో కఠినంగా ఉంటే జాగ్రత్తగా బాధ్యతగా ఉంటారని భావిస్తుంటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు(Parents) అతిగా శ్రద్ధ తీసుకోవడం చేయడం వల్ల పిల్లలు మానసికంగా కృంగిపోతుంటారు. కాబట్టి పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Rainy-Season : వానాకాలం.. వ్యాధుల కాలం.. చెక్ పెట్టండి ఇలా..

మీ పిల్లలు చదువులో వెనుకబడి ఉన్న లేదా కొన్ని సబ్జెక్ట్స్(Subjects)లో మార్కులు సరిగ్గా రాకపోయినా వారిని కఠినంగా శిక్షించకండి .అలాగే ఇతర పిల్లల మార్కులతో పోల్చకండి. అలా చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయి. మరియు పేరు ఉన్న స్కూల్స్ లో అడ్మిషన్స్ పొందాలని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్(1st Rank) రావాలని షరతులు విధించకండి. అలా చేయడం వలన వారిలో భయం కలుగుతుంది. అప్పుడు వారిలో ప్రతికూల భావజాలం మొదలవుతుంది. వారు ఒత్తిడి మరియు నిరుత్సాహానికి గురవుతారు.

వారికి ఇష్టమైన సబ్జెక్టులో కాన్ఫిడెంట్ తగ్గిపోయి మానసికంగా బలహీనులవుతారు. తల్లిదండ్రులు వారు సమర్థత(Efficiency)ను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తమ ఇష్టాలను పిల్లలపై బలవంతంగా రుద్దకూడదు.కొంతమంది పేరెంట్స్ పిల్లల విషయంలో అదే జాగ్రత్తలు పాటిస్తారు. దీని వలన ఆ పిల్లలు ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల పైన ఆధారపడతారు. సొంతగా ఏ చిన్న పని కూడా చేయలేరు. ఎందుకంటే అటువంటి పిల్లల్లో సొంతగా ఆలోచించే శక్తి తక్కువగా ఉంటుంది. మానసిక పరిపక్వత ఉండదు.

Image Credit : Eenadu

వాళ్లలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది ఆ పిల్లలు పేరెంట్స్ హెల్ప్(Help) లేకుండా నేను ఏ పని చేయలేకపోతున్నా అని లోలోపల మదన పడుతుంటారు. కాబట్టి పిల్లల విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. అందువలన వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రయత్నించండి. అప్పుడు వారిలో మానసిక ఎదుగుదల వస్తుంది. అప్పుడు వారు పనులు తో పాటు సొంత నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కొంతమంది పేరెంట్స్ అతిగా షరతులు విధిస్తారు. దీనికోసం పిల్లల్ని బెదిరిస్తారు.

Dosa Recipe : ఇనుప పెనం పై ఫటా ఫట్ దోసె చేసేయండి ఇలా..

షరతులు పెట్టి శిక్షలు విధిస్తూ ఉంటారు. అవి కూడా కఠినంగా ఉంటాయి.అటువంటి సందర్భంలో పిల్లలు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు .వాళ్ళు, పేరెంట్స్ తో మాట్లాడాలన్న భయపడుతుంటారు. అలాంటి వారిలో ఏ పని చేయాలన్న భయంతో ,ఆత్మవిశ్వాసాన్ని(Self-confidence) కోల్పోతారు. వారు ఏ పని చేయాలన్నా కష్టంగా భావించి, శిక్ష వేస్తారేమోనని భయపడిపోతూ ఉంటారు.

పిల్లలు తల్లిదండ్రులకు ఏమైనా చెప్పాలి అని వచ్చినప్పుడు వారిని మాట్లాడనివ్వండి. వారు చెప్పిన దానిలో తప్పులు(Faults) ఉంటే తిట్టకుండా మరియు గట్టిగా అరవకుండా నెమ్మదిగా వివరించి చెప్పండి. వారి భావాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. వారి యొక్క మనసులో ఉన్న భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పిల్లలతో కఠినంగా ఉండకుండా స్నేహంగా మరియు ప్రేమగా ఉండండి .కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఇటువంటి జాగ్రత్తలు పాటించడం వలన వారిలో మానసిక పరిస్థితి మెరుగ్గాఉంటుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in