Money Return By Railway: మీరు బుక్ చేసుకున్న రైలు ఆలస్యం అవుతుందా? డబ్బు వాపసు పొందడం ఎలానో మీకు తెలుసా?
సుదూర రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, మీరు మీ టిక్కెట్‌కి పూర్తి వాపసు పొందవచ్చు. ఎలా అంటే?
Money Return By Railway: భారతీయ రైల్వేలు (Indian Railways) ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రవాణా సంస్థ అని మన అందరికీ తెలుసు. దేశంలోనే ఇది అతి పెద్ద సంస్థ. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, రైల్వే ట్రాక్ (Railway Track) పనుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు అవుతున్నాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. లేదా సాంకేతిక సమస్యల (Technical Problems) కారణంగా రైళ్లు రద్దు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు, రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి? రైలు మరింత ఆలస్యం అయితే వాపసు పొందవచ్చా? లేదా అనే డౌట్ మనకి వస్తుంది. రైలు ఆలస్యమైతే, మీరు మీ టిక్కెట్ కొనుగోలుకు పూర్తిగా వాపసు పొందవచ్చు.
సుదూర రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, మీరు మీ టిక్కెట్‌కి పూర్తి వాపసు పొందవచ్చు. దీనికి మీరు టికెట్ డిపాజిట్ రసీదు లేదా TDRని ఫైల్ చేయాలి. అయితే, రైలు ఎక్కే ముందు టీడీఆర్ ఫైల్ (TDR File) చేయాలి. మీ రైలు చాలా గంటలు ఆలస్యం అయితే, మీరు మీ టిక్కెట్ (Ticket) ను రద్దు చేయవచ్చు. ఈ సందర్భంలో కూడా, మీరు TDRని ఫైల్ చేస్తే, మీరు రీయింబర్స్‌మెంట్‌ను పొందవచ్చు. మీరు ఆన్లైన్ (Online) లో టిక్కెట్ (Ticket) లను కొనుగోలు చేస్తే, మీరు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు రీఫండ్ అందుకుంటారు. స్టేషన్ కౌంటర్లో టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లయితే, వాపసు అక్కడ దరఖాస్తు చేయాలి. రైలును రైల్వే రద్దు చేస్తే, ప్రయాణికులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రైల్వే టికెట్ డబ్బును రీఫండ్ (Refund) చేస్తుంది.
వాపసు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
టిక్కెట్ రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేసుకోడానికి, TDR ఫారమ్‌ను పూరించండి. దీన్ని చేయడానికి, ముందుగా IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో (mobile App) లాగిన్ చేయండి.
ఇప్పుడు, ‘మై ట్రాన్సాక్షన్’ ఆప్షన్ (My Transaction Option) ను ఎంచుకోండి.
ఇప్పుడు ‘ఫైల్ TDR’ ఆప్షన్ ను ఎంచుకోండి.
ఆ తర్వాత, రైలు PNR నంబర్ మరియు క్యాప్చా ను నమోదు చేయండి. ఇప్పుడు రద్దు క్యాన్సిలేషన్ బాక్స్ (Cancellation Box) ను చెక్ చేయండి.
ఆ తర్వాత, సబ్మిట్ బటన్ (Submit) ను క్లిక్ చేయండి. మీరు నమోదు చేసుకున్న లేదా టికెట్ బుకింగ్ ఫారమ్‌లో అందించిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Comments are closed.