ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కొన్ని నమ్మకాలను కలిగి ఉంటాడు. అది నమ్మకమా , మూఢ నమ్మకమా అనేది ఎవరి ఆలోచనా విధానంలో వారు అనుసరిస్తుంటారు. నమ్మకం అనేది ఒకరికి నస్టం కలిగించేది మరొకరికి అదృష్టం కలిగిస్తుంది అలాంటి సంఘటనే ఇటీవల యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వరిస్తుందో చెప్పలేము. కొంతమంది మనుషులకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. అవి ఎంతవరకు నిజమవుతాయో తెలియదు కానీ ఒక మహిళకు మాత్రం నిజమైందని చెబుతుంది. తన పుట్టినరోజు (Birthday) సందర్భంగా ఓ లాటరీ టికెట్ (Lottory ticket) కొన్నది. అయితే ఆమెకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు 10 లక్షల రూపాయల చొప్పున 30 సంవత్సరాల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది. ఈ లాటరీ తనకు రావడానికి కారణం సాలీడు (Spider) వల్ల వచ్చింది అని భావిస్తున్నాను అని చెప్పింది. ఇది వినడానికి వింతగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఉంటాయి.
ఈ సంఘటన ఇంగ్లాండ్ (England) లో జరిగింది. ఇంగ్లండ్ లోని డోర్కింగ్ (Dorking) కు చెందిన 70 సంవత్సరాల వయసు ఉన్న డోరిస్ స్టాన్ బ్రిడ్జ్ అనే మహిళ ఈ మధ్యనే తన పుట్టినరోజు జరుపుకుంది. ఆ సమయంలో ఆమెకు తన ఇంటి ఎదురుగా ఉన్న గార్డెన్ (Garden) లో మనీ స్పైడర్ (Money spider) అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం వస్తుందని అక్కడ ప్రజలు (people) నమ్ముతుంటారు. మనీ స్పైడర్ కనిపించిన సందర్భంగా ఆమె ఆరోజు లాటరీ టికెట్ కొనింది.
కొన్ని రోజుల తర్వాత లాటరీ సంస్థ వారు ఆమెను ఈ-మెయిల్ (E-mail) ద్వారా సంప్రదించారు. ఆమె టికెట్ నెంబర్ పై బంపర్ లాటరీ (Bumper Lottery) తగిలిందని 30 సంవత్సరాల పాటు నెలకు 10 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వస్తాయని చెప్పారు.
దీంతో ఆమె సంతోషానికి అంతే లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆమెకు వంద సంవత్సరాలు బ్రతకాలి అని అనిపిస్తుందని మీడియాతో చెప్పింది. తన కుటుంబ సభ్యులను, బంధువులందరినీ తీసుకొని విదేశీ టూర్ కి వెళ్ళడానికి ప్లాన్ (plan) చేస్తున్నానని, అలాగే గ్రామీణ (Village) ప్రాంతంలో ప్రకృతి అందం తొణికిసలాడే భారీ బంగ్లా కొనే ఆలోచనలో ఉన్నానని కూడా ఆమె చెప్పుకొచ్చింది.