చలికాలంలో ఎక్కువగా బాధించే సమస్యలలో నోటిపూత (Mouth Ulcer) ఒకటి. ఈ నోటి పూత అనేది చలికాలంలో ఎక్కువగా రావడానికి కారణం, ఈ సీజన్లో నీరు మరియు గాలి లో బ్యాక్టీరియా అనేది అధికంగా ఉండటం.
ఈ సమస్య పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వస్తూ ఉంటుంది. నోటిపూత వచ్చినప్పుడు తినడానికి, బ్రష్ చేసుకోవడానికి, కొన్ని సందర్భాల్లో నీళ్లు త్రాగడానికి కూడా చాలా ఇబ్బంది గా ఉంటుంది.
జీర్ణ సమస్యలు (Digestive problems), ఒత్తిడి, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు నోటి పూత సమస్య అనేది వస్తుంటుంది.
నోటి పూతను తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వీటిని పాటించినట్లయితే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులు :
రోజుకు రెండుసార్లు తులసి ఆకుల (Basil leaves) ను నమలడం వలన నోటి పూత తగ్గుతుంది. అంతేకాకుండా నోట్లో ఉన్న క్రిములు మరియు బ్యాక్టీరియా ను నిర్మూలిస్తుంది. అలాగే తులసి ఆకులు నోటి దుర్వాసన రాకుండా చేయడంలో కూడా సహాయపడతాయి.
నెయ్యి :
నోటి పూత వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు వాటిపై నెయ్యి (ghee) ని అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది.
Also Read : రంగు మారిన దంతాలను తెల్లగా, ధృఢంగా మార్చి నోటి దుర్వాసన సైతం మాయం! ఇవి వాడితే రిజల్ట్ ఖాయం.
టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్ లో దూదిని ముంచి నోటి లో ఉన్న పుండ్ల మీద పెడితే మంచి ఫలితం కనబడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ :
నీళ్లల్లో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి ఈ నీటిని రోజుకు రెండుసార్లు పుక్కిలించడం (gargling) వల్ల నోటి పూత సమస్య తగ్గుతుంది.
పెరుగు :
నోటిపూతతో బాధపడేవారు పెరుగు (curd) ను తినడం వల్ల నోటి పూతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకనగా పెరుగులో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. అంతేకాకుండా పెరుగు తినడం వలన పొట్టలో ఉన్న వేడిని తగ్గించి, పొట్టను చల్లబరుస్తుంది. తద్వారా నోటిపూత తగ్గుతుంది.
లవంగ నూనె :
లవంగ నూనెను నోటి పూత పై రాసి, 10 నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటి (Warm water) తో, నోటిని కడగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
తేనె :
నోటి పూత ను తగ్గించుకోవడానికి తేనె (Honey) కూడా చాలా బాగా సహాయపడుతుంది. తేనె లో యాంటీ వైరల్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. తేనెను నోటి పూత పై రాయడం వల్ల మంట తగ్గి, చల్లగా ఉంటుంది.
పసుపు :
పసుపు (Turmeric) లో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక నోటి పూత పై పసుపు ను పెట్టవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో పసుపు వేసి పుక్కిలించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఉప్పు నీళ్లు :
గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి రోజుకు మూడుసార్లు పుక్కిలించడం వలన నోటి పూత నుండి ఉపశమనం కలుగుతుంది.
కాబట్టి ఈ చలికాలంలో (Winter) నోటి పూత తో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలు పాటించండి. తద్వారా మీకున్న సమస్య తగ్గిపోతుంది.