My Safety Pin App: మహిళలకు గుడ్ న్యూస్, ఫోన్ లో ఈ యాప్ ఉంటే చాలు, ఇక ఎక్కడికి వెళ్లినా సేఫే
మహిళలు, ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం కామన్ అయిపొయింది. వారికి భద్రత కల్పించడం కోసం మై సేఫ్టి యాప్ గురించి తెలుసుకుందాం.
My Safety Pin App: ప్రస్తుత కాలంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో, ఇంట్లో ఒక్కళ్ళు సంపాదిస్తే ఇల్లు నడవడం కష్టం అవుతుంది. దీంతో, చాలా మంది మహిళలు బయట వివిధ ఉద్యోగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మహిళల రక్షణ (Women Safety) గురించి ఆందోళన చెందుతున్నారు.
ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్లినప్పటి నుంచి. తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులు భయంతోనే ఉంటాయి. ఈ భయానికి కారణం, మహిళలపై జరుగుతున్న దాడులే. మహిళలు సురక్షితంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఈ యాప్ను ఉపయోగించడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్ తో, మహిళలు (Womens) ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమను తాము రక్షించుకోవచ్చు.
మహిళలు, ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం కామన్ అయిపొయింది. కొంతమంది నైట్ షిఫ్ట్ లు చేస్తారు. దాంతో, రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే, రాత్రిపూట మహిళలు ఒంటరిగా ప్రయాణించడం చాలా ప్రమాదకరం. మై సేఫ్టీపిన్ యాప్ (My Safety Pin:Safety Companion) అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు భరోసా ఇచ్చే ఒక యాప్. లైంగిక వేధింపులకు గురయ్యే లేదా ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు. భద్రతను అందించడానికి సేఫ్టీపిన్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలు సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఫోన్లో ఈ యాప్ను ఇన్స్టాల్ (Install) చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: playables youtube game: యూట్యూబ్ లో గేమ్స్ ఆడుకోవచ్చు! ప్లేయబుల్స్ ని లాంచ్ చేసిన కంపెనీ!
రాత్రిపూట ఒంటరిగా నడిచేటప్పుడు, భయంగా అనిపిస్తే ఈ యాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. దాంతో ఈ యాప్ మనం ఎక్కడున్నామో ట్రాక్ చేస్తుంది. అప్లికేషన్ (Application) లోకి లాగిన్ అవుతున్నప్పుడు, మనం ప్రమాదంలో ఉంటే, సమయానికి వచ్చి సేవ్ చేసే ఐదుగురు వ్యక్తుల ఫోన్ నంబర్లను నమోదు చేయాలి. ఈ యాప్ ద్వారా మహిళల స్టేటస్ అప్డేట్లు వారి ఫోన్ నంబర్లకు టెక్స్ట్ రూపంలో వెళ్తాయి. మహిళా హక్కుల కార్యకర్త కల్పనా విశ్వనాథ్, ఆశిష్ బసు కలిసి 2013లో ఈ యాప్ను అభివృద్ధి చేశారు.
దీన్ని గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి లాగిన్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు మరియు ఇతర సమాచారాన్ని అందించిన తర్వాత, మీ మొబైల్ కి OTP వస్తుంది. ఓటీపీ నమోదు చేస్తే లాగిన్ పూర్తి అవుతుంది. ఇమెయిల్ చిరునామా మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి. ప్రయాణించే ప్రాంతం గురించిన సమాచారాన్ని నమోదు చేయడానికి లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి. దాంతో పోలీసులు ఆ సమాచారం మొత్తాన్ని పర్యవేక్షించగలరు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వారి ఫోన్ లో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.
Comments are closed.