Name Presentation Service: ట్రూ కాలర్ లేకుండా కాలర్ ఐడీని గుర్తించడం ఎలా?

ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోడానికి సాధారణంగా ట్రూకాలర్ ని ఉపయోగిస్తారు. అయితే, ట్రూకాలర్ ని ఉపయోగించకుండా కూడా కాలర్ ఐడీని ఎలా కనిపెట్టాలి ఇప్పుడు చూద్దాం.

Name Presentation Service: సాధారణంగా మనం ప్రతి రోజు ఫోన్ వినియోగిస్తున్నప్పుడు కొత్త నెంబర్స్ నుండి కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే, ట్రూ కాలర్ ఉంటే మనకి ఎవరు ఫోన్ చేస్తున్నారో కనుక్కోవచ్చు. కానీ, ట్రూ కాలర్ (True Caller) లేకుండా కూడా మనకి ఎవరు ఫోన్ చేస్తున్నారో కనిపెట్టేయొచ్చు ఎలానో తెలుసా?

ట్రూ కాలర్‌ను ఉపయోగించకుండానే కాలర్ పేరును తెలుసుకునే ఫీచర్‌ను ట్రాయ్ ప్రవేశపెడుతోంది. మన ఫోన్లలో ఇతరుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకొని ఉంచుకోకపోయినా, మనకు తెలియని వ్యక్తుల నుండి కాల్స్ వస్తే, మన మొబైల్ స్క్రీన్‌లపై వారి పేర్లను ప్రదర్శించే ‘నేమ్ ప్రెజెంటేషన్ సర్వీస్’ (Name Presentation Service) ను ప్రవేశ పెట్టనుంది.

Also Read:Bajaj Freedom 125 Bike : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది.. 330 కి.మీ. మైలేజ్.. ధర ఎంతంటే?

ఈ సేవలను ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నారు. సిమ్ కార్డు పొందేటప్పుడు నమోదు చేసిన సమాచారాన్ని బట్టి కాలర్‌ల పేర్లు చూపబడతాయని చెప్పారు. ఈ రోజుల్లో, చాలా మంది వ్యక్తులు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ‘ట్రూ కాలర్’ యాప్‌ (True Caller APP) ని ఉపయోగిస్తున్నారు. అయితే, డేటా భద్రతకు సంబంధించిన ఆందోళనలకు ప్రతిస్పందనగా TRAI ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.

Comments are closed.