Navodaya Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే, మిమ్మల్ని మీరు మరింత మెరుగైన స్థానంలో నిలబెట్టుకోగలుగుతారు. తాజాగా, 1377 కేంద్ర ప్రభుత్వ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు? అర్హత ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి జవహర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, స్టాఫ్ నర్స్ (మహిళలు), క్యాటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ప్లంబర్/ఎలక్ట్రీషియన్ ల్యాబ్ అటెండెంట్, మరియు మెస్ హెల్పర్ స్థానాలు ప్రకటించారు. వీటి కొరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం, https://navodaya.gov.in/nvs/en/Recruitment/Notification-Vacancies/ ని ఓపెన్ చేసి చూడండి.
పోస్టుల వివరాలు |
పోస్టుల సంఖ్య |
నాన్ టీచింగ్ పోస్టులు | 1377 |
మహిళా స్టాఫ్ నర్సులు | 121 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 05 |
ఆడిట్ అసిస్టెంట్ | 12 |
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ | 04 |
లీగల్ అసిస్టెంట్ | 01 |
స్టెనోగ్రాఫర్ | 23 |
కంప్యూటర్ ఆపరేటర్ | 02 |
క్యాటరింగ్ సూపర్‌వైజర్ | 78 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (HQ/ప్రాంతీయ కార్యాలయాలు) | 21 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JNV) | 360 |
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ | 128 |
ల్యాబ్ అటెండెంట్ | 161 |
మెస్ హెల్పర్ | 442 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 19 |
వయోపరిమితి – అభ్యర్థులు స్థానం ఆధారంగా 18 మరియు 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వయో సడలింపు నిబంధనలు సంబంధిత వర్గాలకు వర్తిస్తాయి.
ఎంపిక విధానం – ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
జీతం – రూ.18000 నుండి 1,42,400 వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము : మహిళా స్టాఫ్ నర్సులకు రూ.1500, ఇతర ఖాళీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు త్వరలో ప్రకటిస్తారు.
Navodaya Recruitment 2024