Telugu mirror : భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్ గా నిలిచాడు. బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023 లో స్వర్ణ పతాకం సాధించడం ద్వారా అతనీ ఘనతను సాధించాడు. మొదటి త్రోను ఫౌల్ చేసిన చోప్రా తన రెండవ ప్రయత్నంగా జావెలిన్ ను 88.17 మీటర్లు విసరడం ద్వారా అతనీ ఘనతను సాధించాడు. మరే ఇతర దేశ అథ్లెట్ కూడా ఈ దూరాన్ని జావెలిన్ ను విసరడం ద్వారా అధిగమించలేక పోయారు.
హంగేరి లోని బుడా పెస్ట్(Buda Pest)లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఆదివారం (ఆగష్టు 27) జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ రౌండ్ లో తన రెండవ ప్రయత్నంలో 88.17 మీటర్లు విసరిన నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ ఈ ఈవెంట్ లో రెండవ స్థానంలో నిలిచాడు. అతను తను విసిరిన మూడవ త్రోలో 87.82 మీటర్లు విసరడం ద్వారా ద్వితీయ స్థానంలో నిలిచాడు.
The Olympic champion becomes the javelin throw world champion ☄️
🇮🇳's @Neeraj_chopra1 throws 88.17m to upgrade last year's silver medal into glittering gold in Budapest 👏#WorldAthleticsChamps pic.twitter.com/8K1mIvcYmF
— World Athletics (@WorldAthletics) August 27, 2023
ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు తొలి స్వర్ణం
ప్రపంచ అథ్లెటిక్స్(Athletics) ఛాంపియన్ షిప్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశంలో భారత దేశానికి ఇదే తొలి బంగారు పతకం. అధ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా తన పేరున చరిత్ర సృష్టించాడు. ఇంతకు మునుపు 2003 లో భారత్ తరఫున అంజూ బాబీ జార్జ్ లాంగ్ జంప్ లో కాంస్య పతకం సాధించింది. అయితే 2022 లో జరిగిన ఛాంపియన్ షిప్ పోటీలలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో భారత్ తరఫున జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా తోపాటు డి పి మను, కిషోర్ జెనా కూడా పతకం సాధించడం కోసం పోరాడారు. కానీ కిషోర్ ఐదవ స్థానంలో, మను వచ్చేసి ఆరవ స్థానంలో నిలిచారు. నీరజ్ చోప్రా 2024 లో జరగబోయే పారిస్ ఒలంపిక్స్ కు కూడా అర్హత సాధించాడు. 2024 జూలై 26 నుంచి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ జరుగుతాయి.
నీరజ్ చోప్రా అభినవ్ బింద్రా తో సమానంగా
ఇంతకు మునుపు 2022లో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించాడు. ఈసారి 2023లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించాలని పోటీ చేసిన వారిలో చోప్రా కూడా ఒకడు. అయితే అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా బంగారు పతకం సాధించాడు. ఈ ఘనత సాధించడం ద్వారా గతంలో ఒలంపిక్స్ లోనూ మరియు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో కూడా పోటీ పడి రెండింటిలోనూ గోల్డ్ మెడల్ సంపాదించుకున్న భారత సీనియర్ షూటర్ అభినవ్ బింద్రా చారిత్రాత్మక రికార్డ్ ను నీరజ్ చోప్రా సమం చేశాడు.
అభినవ్ బింద్రా(Abhinav Bindra) ఒలంపిక్స్ లో మరియు వరల్డ్ ఛాంపియన్ షిప్ లో వ్యక్తిగత ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. రెండు ఈవెంట్ లలో పతకం సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్రా. 2008 ఒలంపిక్స్( Olympics)లో షూటింగ్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు గా బింద్రా నిలిచాడు, 2006 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో స్వర్ణం సాధించాడు అభినవ్ బింద్రా. ఇప్పుడు బింద్రా రికార్డ్ ను సమం చేయడంతో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో విజేతగా నిలిచిన మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.