Telugu Mirror Automobile

New Rules For Fast Tag: మీ వాహనం కి ఇప్పుడు ఇది అమర్చడం తప్పనిసరి. మారనున్న టోల్ ప్లాజా రూల్స్

టోల్ ప్లాజా(Toll Plaza) ల వద్ద వాహనాల రద్దీ ని తగ్గించడానికి, సమయాన్ని ఆదా చేసేందుకు గతంలో టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ (Fast Tag)విధానంను ప్రవేశ పెట్టారు. ఫాస్ట్ ట్యాగ్ విధానంలో కూడ అనుకున్న ఫలితం లేదని ఇప్పుడు కూడా ప్రజలు టోల్ గేట్ ల వద్ద జామ్ సమస్యను ఎదుర్కుంటున్నందున ప్రభుత్వం త్వరలో ఫాస్ట్ ట్యాగ్ విధానం లో మార్పులు చేపట్టే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం టోల్ వసూలు కోసం నూతన విధానాన్ని ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉంది.టోల్ వసూలు కోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ANPR) కెమెరాలు అనే నూతన విధానంలో GPS తో నడిచే టోల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

కొత్తగా ప్రవేశపెట్టే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ANPR ) విధానం వెహికల్ యొక్క లైసెన్స్ ప్లేట్ ను రీడ్ చేస్తుంది. ఆ తరువాత వెహికల్ యజమాని బ్యాంక్ ఖాతానుండి టోల్ ట్యాక్స్ మినహాయింపు చేసుకుంటుంది. ఈ విధానం టోల్ గేటు దగ్గర లోపలకు వచ్చే మరియు వెలుపలకు వెళ్ళే మార్గంలో పెట్టిన కెమెరాల పై ఆధారపడి ఉంటుంది. ఈ కెమెరాలు ఎంట్రీ మరియు ఎక్జిట్ లలో వాహనం యొక్క లైసెన్స్ ప్లేట్ ఫోటోను తీస్తాయి అలాగే వాహనం నంబర్ నుండి టోల్ ద్వారా టోల్ ట్యాక్స్ ను తీసివేస్తాయి.కొత్తగా ప్రవేశ పెట్టే ANPR విధానం ఫాస్టాగ్ ప్లేస్ లో మెరుగైన ఎంపికగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Also Read:Delhi Metro–ఢిల్లీ మెట్రో లో మళ్ళీ లొల్లి…

టోల్ ప్లాజాల వద్ద వాహనాలు జామ్ అవడం వలన దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన ఆయిల్ మరియు టోల్ గేట్ ల వద్ద వాహనాలు ఆగడం మూలంగా ప్రతి సంవత్సరం సుమారు 45 వేల రూపాయలు వేస్ట్ గా అయిపోతున్నాయి. కోట్లాది రూపాయల నష్టం అంటే దేశం మొత్తం మీద టోల్ ప్లాజాల వలన దేశానికి రూ. లక్షా 45వేల కోట్ల నష్టం జరుగుతుందని , ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఐఐఎం కోల్ కతా నివేదికలు తెలిపాయి. అందుకని ప్రజల డబ్బును,దేశ ఆర్థిక నష్టాన్ని నివారించడం కోసం GPS వ్యవస్థ త్వరలో ప్రారంభం అవుతుంది.

వాహనం నంబర్ ప్లేట్ మారుతుందా?

ప్రభుత్వం త్వరలో వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ లలో కూడా మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలనే కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నూతన వాహనాలకు GPS నంబర్ ప్లేట్ ను పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా పాత వెహికల్స్ నంబర్ ప్లేట్ కు కొత్త GPS నంబర్ ప్లేట్ ను అమర్చవలసి వస్తుంది.

ఈ నూతన విధానంలో కొత్త నంబర్ ప్లేట్ కు GPS ను అమర్చుతారు.అలాగే టోల్ గేట్ దగ్గర ఒక సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేస్తారు. దీనివలన వాహనం బయలుదేరగానే మీ బ్యాంక్ ఖాతా నుండి టోల్ ట్యాక్స్ అమౌంట్ కట్ అయిపోతుంది. కొత్తగా అమర్చే నంబర్ ప్లేట్ లో ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది,ఇంతకు ముందులా మామూలుగా ఉండదు.

Also Read:Women Loan Scheme : మహిళల కోసం అద్భుత రుణ పథకం..దళిత మహిళ లకు వడ్డీ లేకుండా రుణం

కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కొత్త వాహనాలకు జీపీఎస్ నంబర్ ప్లేట్ ను అమర్చవలసిందే. పాత వాహనాలకు కూడా అప్పటి నంబర్ ప్లేట్ ను తీసివేసి జీపీఎస్ సిస్టమ్ ఉన్న కొత్త నంబర్ ప్లేట్ ను అమర్చవలసిందే. నంబర్ ప్లేట్ లో జీపీఎస్ విధానంతో పాటు కొత్త సాఫ్ట్ వేర్ ని అమర్చుతారు.దీనివలన మీరు టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే టోల్ ఫీజు వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో కట్ అవుతుంది.