Telugu Mirror: తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ(rythu runa mafi) ప్రక్రియ మొదలయిన విషయం అందరికి తెలిసిందే. 2014 లో రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ ఇచ్చిన మాట తప్పకుండ హామీని నెరవేర్చారు.దాదాపు 36 వేల వరకు ఉన్న మాఫీలను 2018 లో నిర్వహించి మిగిలిన వాటిని పూర్తి చేయడానికి కెసిఆర్(kcr) గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుసు.
అయితే సెప్టెంబర్ రెండవ వారం లోగ మిగిలిన రుణాలన్నింటినీ పూర్తి చేయాలనీ CM కెసిఆర్ గారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు(minister harish rao) గారికి ఆదేశాలు జారీ చేసారు. అయితే ఈ రుణమాఫీ లో మరి కొన్ని కొత్త రూల్స్(runa mafi new rules) వచ్చి చేరాయి.అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.
వ్యవసాయ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే తమ రుణాలను 2018 డిసెంబర్ 11 నాటికీ పొందుతారో వారికి మాత్రమే మాఫీ వర్తిస్తుంది ఆ తర్వాత తీసుకున్న వారికీ రుణమాఫీ అనేది జరగదు అని తెలిపారు. ఈ రుణమాఫీ పై రైతులకు వచ్చిన అనుమానాలకు అధికారులు స్పష్టత ఇచ్చారు .
Also Read:Gruha Lakshmi Scheme: మీ ఇంటి నిర్మాణం ఇంకా కలగానే మిగిలిందా? గృహలక్ష్మి పథకం తో నెరవేర్చుకోండి మరి!
ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు మాత్రమే మాఫీ జరుగుతుందని చెప్పారు.పంట ఋణం కింద లక్ష కన్నా ఎక్కువ తీసుకున్న కూడా లక్ష రూపాయాలు మాత్రం కచ్చితంగా మాఫీ అవ్వడం అనేది జరుగుతుంది . డిసెంబర్ 11 లోపు బ్యాంకుల్లో లక్ష ఋణం ఉండి తర్వాత రెనెవెల్ చేయించుకున్న లేదా ఆ ఋణం మొత్తం వడ్డీతో సహా బ్యాంకు కు చెల్లిన వాళ్ళకి ఎంత ఋణం అయితే ఉంటుందో అంతవరకు మాఫీ వర్తిస్తుంది.
లక్ష రూపాయలు తీసుకున్న వారికి అయితే ఆ లక్ష రూపాయలు మాఫీ అవుతాయి . అయితే కొందరికి డిసెంబర్ 11 2018 లోపు లక్ష రూపాయల కన్నా తక్కువ అప్పు ఉండి దానికి వడ్డీ కట్టకుండా ఉంటె మాత్రం లక్ష రూపాయల మాఫీ అవ్వదు మరియు మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో అంతవరకు మాత్రమే మాఫీ అవుతుంది. వడ్డీకి రుణమాఫీ కి ఎలాంటి సంబంధం లేదు.కాబట్టి వడ్డీని మీరే కట్టుకోవాలి.
మరొకటి ఏంటంటే ఇంట్లో భార్యాభర్తలు(wife & husband) ఇద్దరు లక్ష కన్నా ఎక్కువ డబ్బు తీసుకుంటే భార్యభర్తలలో ఒకరికి మాత్రమే మాఫీ అవుతుంది లేదా భార్యభర్తలు ఇద్దరికి కలిపి లక్ష రూపాయలు మాఫీ అవ్వడం జరుగుతుంది. వారికీ కూడా లక్ష రూపాయలు మాత్రమే మాఫీ అవుతాయి మిగిలిన డబ్బును మాత్రం మీరే కట్టుకోవాలి మాఫీ అనేది అవ్వదు అని స్పష్టత ఇచ్చారు .