Telugu Mirror : Asus తన నూతన స్మార్ట్ ఫోన్ ని యూరోపియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది.తైవాన్ కు చెందిన Asus కంపెనీ 6- యాక్సిస్ హైబ్రిడ్ గింబాల్ స్టెబిలైజర్ 2.0 తో జోడీచేయబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8Gen ప్రాసెసర్ ని కలిగి వున్న తన కొత్త స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. Asus Zen Fone 10 డివైజ్ 16GB RAM ని కలిగి ఉండి,144Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది.అయితే Zen 10 ప్రస్తుతం కేవలం యూరప్ మార్కెట్ లలోనే లాంఛ్ చేయబడింది.త్వరలో మిగతా దేశాలలో విక్రయానికి లభిస్తుంది.
Asus ZenFone 10 స్పెసిఫికేషన్ లు:
తైవాన్ Asus ఫోన్ 5.9-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ ప్లే ని కలిగి ఉంటుంది.2,400×1,080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి 144Hz రిఫ్రెష్ రేట్ తో డివైజ్ Qualcomm Adreno 740తో కలసి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8Gen2 ప్రాసెసర్ తో వస్తుంది. Asus ZenFone 10 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్13 పై రన్ అవుతుంది. హ్యాండ్ సెట్ 16GB RAM ని కలిగి ఉండి 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది.
కెమెరా:
ఫోన్ యొక్క ముందు భాగంలో కెమెరా కలిగి ఉంటుంది.అలాగే బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా అమర్చబడింది.హ్యాండ్ సెట్లో 2.0 + 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ తో కూడిన Sony IMX766 సెన్సార్ కలిగిన 50- మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా సెటప్ ఉంది.అదేవిధంగా ZenFone 10 ముందు భాగంలో RGBW సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫీల క్యాప్చర్ కోసం 32- మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Asus ZenFone 10 బ్యాటరీ:
30W ఫాస్ట్ ఛార్జింగ్,15W వైర్ లెస్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉండి పరికరం 4,300mAh బ్యాటరీతో వస్తుంది.హ్యాండ్ సెట్ IP68 రేటింగ్ కలిగి డస్ట్ రెసిస్టెన్స్ తో పాటు 30 నిమిషాలు 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల వరకు ఫోన్ లైఫ్ సెక్యూర్ కలిగి వుంటుంది అని భావిస్తున్నారు.
10 కనెక్టివిటీ:
ZenFone 10 కనెక్టివిటీ ఫీచర్ లలో 5G,4G VoLTE ,BlueTooth 5.3,వై-ఫై 802.11be 7,GPS,3.5mm హెడ్ ఫోన్ జాక్ అలాగే USB టైప్-C మరియు ఇతర కనెక్టివిటీలను కలిగి ఉంది.ఈ డివైజ్ 172 గ్రాములు బరువు ,146.5mm ×68.1mm ×9.4mm కొలతలతో లభిస్తుంది.
Asus ZenFone 10 ధర మరియు రంగులు:
ZenFone 10 మూడు వేరియంట్ లలో లభిస్తుంది.
- బేస్ మోడల్ 8GB RAM తో 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.ఈ మోడల్ ధర EUR 799( దాదాపు రూ.71,260).
- 8GB RAM కలిగి 256GB నిల్వసామర్థ్యం కలిగిన మోడల్ ధర EUR 849(సుమారు రూ.75,714).
- 16GB RAM ని కలిగి ఉండి 512GB స్టోరేజ్ ఉన్న హ్యాండ్ సెట్ ధర EUR 925(సుమారు రూ.82,851).
- Asus ZenFone 10 స్మార్ట్ ఫోన్ స్టార్రీ బ్లూ,కామెట్ వైట్,ఎక్లిప్స్ రెడ్,అరోరా గ్రీన్ మరియు మిడ్ నైట్ బ్లాక్ వంటి మల్టీ వేరియంట్ లలో లభిస్తుంది.