Telugu Mirror : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన వివో (Vivo), ఇటీవల తమ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన Vivo V30 సిరీస్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ మరొక 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది. అదే Vivo T3 5G స్మార్ట్ ఫోన్.
ఈ విషయాన్ని కంపెనీ తమ ఆధికారిక X (Twitter) అకౌంట్ ద్వారా వెల్లడించింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ- కామర్స్ ప్లాట్ ఫారం అయిన ఫ్లిప్ కార్ట్ లో సేల్ కి అందుబాటులో ఉండనుందని కూడా కంపెనీ ప్రకటించింది. మరొకవైపు ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర, ఫీచర్స్ ను కంపెనీ ఇంకా ప్రకటించకముందే కొన్ని వివరాలు లీక్ అవ్వడం జరిగింది.
Also Read : Hyundai Creta N Line : హ్యుందాయ్ నుంచి మరో మోడల్.. స్పోర్టీ లుక్‌లో మతి పోగొడుతున్న SUV..
ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 20,000 లుగా ఉండే అవకాశం ఉంటుందని మరియు ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. వీవో ఈ మొబైల్‌ను Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని డిజైన్ కూడా ఎంతో స్ట్రైలీస్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vivo T3 5G స్పెసిఫికేషన్స్ :
త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ కాబోయే Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. అలాగే దీని స్క్రీన్ HD+ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ డిప్ల్పే గరిష్టంగా 1800 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాల్లో తెలుస్తుంది. దీంతో పాటు శక్తివంతమైన డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
Also Read : Voltas AC : సమ్మర్ లో బంపర్ ఆఫర్..వోల్టాస్ ఏసీపై భారీ డిస్కౌంట్.
అంతేకాకుండా Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిది 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, రెండవది 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. అలాగే ఇది 5,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ స్పీకర్స్ సిస్టమ్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.