New Telangana Governor: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. రాజకీయాల కోసం ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టు అందరూ అనుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
సుమారు నాలుగేళ్ల పదవి చేశారు..
ఈ క్రమంలో బీజేపీ తరపున తమిళిసై చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీగా పోటీ చేయనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. ఆమె గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా గవర్నర్‌గా పనిచేశారు మరియు ఇప్పుడు అదే రాష్ట్రానికి లోక్‌సభ బరిలోకి దిగనున్నారు. తమిళసై సౌందరరాజన్ 2019 సెప్టెంబర్ 8న గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. సుమారు నాలుగేళ్లుగా ఈమె పదవిలో కొనసాగారు.
రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆమె స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించారు. సీపీ రాధాకృష్ణన్ ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు మరియు తెలంగాణకు బాధ్యత వహిస్తున్నారు. ఆయన తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తారు. అంటే, సీపీ రాధాకృష్ణన్ జార్ఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు.
సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. గతంలో బీజేపీ పార్టీ కోసం కస్టపడి పనిచేశారు. కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తరువాత, CP రాధాకృష్ణన్ ఫిబ్రవరి 12, 2023న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
New Telangana Governor