Weather Update : తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..రేపటి నుంచి 3 రోజులు వర్షాలు..వాతావరణ శాఖ వెల్లడి..!

అతి వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు గుడ్ న్యూస్. నేటి నుంచి మార్చి 21 మధ్య వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Telugu Mirror : ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలో ఉండే ఎండలకే ప్రజలు తట్టుకోలేపోతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వేడికి తట్టుకోలేపోతున్నారు. అయితే దీనిపై భారత వాతావరణ శాఖ చల్లటి వార్తను తీసుకొచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అతి వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మంచి వార్త అనే చెప్పాలి. వర్షం పడితే, ఈ ఎండల నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు. నేటి నుంచి మార్చి 21 మధ్య వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తెలుగురాష్ట్రాలతో పాటు..

వీటితో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురలలో మార్చి 16 మరియు 21 మధ్య వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

Also Read : TG Code Number Plate 2024: ఈరోజు నుండి నెంబర్ ప్లేట్ల పై టీజీ కోడ్, మరి పాత వాహనాల పరిస్థితి ఏంటి?

మార్చి మొదటి వారం తర్వాత మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు.ఇంకా, వాతావరణ సూచన దక్షిణ మరియు ఉత్తర తీరాలలో చల్లని వాతావరణాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. కానీ రాయలసీమలో మాత్రం ఈ నెల 20వ తేదీ వరకు కొన్ని రోజులు ఎండలు ఉండొచ్చని భావిస్తున్నారు.

a-bulletin-has-issued-that-telangana-and-andhra-pradesh-are-likely-to-receive-light-rains-for-four-to-five-days

ఇంకా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, రాయలసీమలో 20వ తేదీ నుంచి చలిగాలులు మొదలవుతాయని వాతావరణ సూచన వెల్లడించింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కారణంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలుకురుస్తున్నాయని, ఒడిశాలో కూడా  వర్షాలు కురిసినట్లు సమాచారం.

ఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి..

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఉదయం 11 గంటల నుంచి కాస్త ఎండలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం 3 గంటలకే వాతావరణం చల్లబడుతుందని తెలిపారు.

ఈ నెలాఖరు వరకు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ పరిస్థితులు మరో రెండు వారాలు లేదా ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతాయి, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ క్రమంగా పెరుగుతాయని, మేలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలిపారు.

Also Read : White Ration Card Update 2024: తెల్ల రేషన్ కార్డులపై కీలక అప్డేట్, వారికి మాత్రం రేషన్ కార్డులు రావు

తీరా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..

రానున్న రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మరింత వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ మరియు ఉత్తర తీరాలలో వాతావరణం చల్లగా మారుతుందని రెండు వారాల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

Comments are closed.