Telugu Mirror : సాధారణంగా వర్షాకాలం(Rainy Season)లో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాం.వానాకాలం లో ఇళ్లల్లోకి కూడా మనకి తెలియకుండానే విషపూరితమైన పాములు,తేళ్లు వస్తాయి. కొన్ని కూరగాయలలో చిన్న చిన్న పురుగులు,సూక్ష్మ క్రిములు ఉండడం సహజం.ముఖ్యంగా వర్షాకాలం లో ఆకు కూరలు , పచ్చని కూరగాయలను కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తలు తీసుకుంటే ఊహించని సంఘటనలు కూడా జరుగుతాయి.
PM Vishwakarma Yojana : చేతి వృత్తుల వారికి మొదటి సారి కేంద్రం చేయూత..అర్హులు వీరే
ఇప్పుడు ఫుల్ వైరల్(Viral) గా మారిన ఈ వీడియో నెట్టింట నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో తో మీ ముందుకు వచ్చాం. అది ఏంటో మీకు తెలుసా ? కాలి ఫ్లవర్ లో పాము ప్రత్యక్షమై సంఘటన అందరి దృష్టిని తమ పైపు కు తిప్పుంది.ఒక కుటుంబం కూరగాయల మార్కెట్ నుండి కూరగాయలను కొనుగోలు చేసారు . ఇంటికి వచ్చాక ఆ కూరగాయలను పరిశీలించగా ఏదో కదులుతున్నట్టుగా అనిపించి, ఏంటా అని ఆ కాలీఫ్లవర్ ని చిన్నగా కట్ చేస్తూ క్షుణ్ణంగా పరిశీలించగా పాము పిల్ల కనిపించింది.ఆ పాము పిల్లను చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
Which type of a Cauliflower is this?🙄🙄
Cobra Cauliflower or Viper Cauliflower 🤔🤔#snake #CobraKai #Viper #vegetables pic.twitter.com/RyuFE85tYv— Devendra Saini (@dks6720) August 4, 2023
దేవేంద్ర సైనీ అనే పేరు గల అతను కాలీఫ్లవర్ నుండి పాము వచ్చిన సంఘటనను ఆగష్టు 4వ తేదీన తన ట్విట్టర్ హ్యాండిల్ @dks6720లో పోస్ట్ చేసాడు. “ఇది ఏ రకమైన కాలీఫ్లవర్ ? కోబ్రా కాలీఫ్లవరా? లేక వైపర్ కాలీఫ్లవరా ? అని చెప్పడం ట్విట్టర్ వీడియో లో మనం గమనించవచ్చు. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది , ఎప్పుడు చోటు చేసుకుంది అనే విషయానికి స్పష్టత ఇవ్వలేదు.
పోస్ట్ చేసిన వీడియో ని చూస్తే ఒకరు వీడియో తీస్తుండగా మరొకరు ఆ కాలీఫ్లవర్ యొక్క కాడలను ఒక్కొక్కటిగా వేరు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వేరు చేసే సమయం లో ఆ పాము ఒక దానిలో నుండి మరొక దానిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. అలా వేరు చేసే సమయం లో ఆ కాలీఫ్లవర్ లో విషపూరితమైన కట్ల పాము కనిపిస్తున్నట్లు ఉంది.వీడియో ని షేర్ చేసిన వారు , కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు , కొనుగోలు చేసిన తర్వాత వంట చేసే సమయం లో జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు.
మొత్తానికి ఈ వీడియో సూపర్ వైరల్ గా మారి వీక్షకులకు భయానికి గురి చేసింది. అయితే ఒక ట్విట్టర్ యూసర్ “మై హు హై ” అని కామెంట్ చేయగా మరొకతను “యార్ ఆప్ గోభీ మే క్యా కర్ రహే హో” అని కామెంట్ చేసాడు.