Aadhar Pan Linking: ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేశారా. ఈ ఒక్క రోజే అవకాశం

ఆధార్ కార్డ్(Aadhar Card) కి మీ శాశ్వత ఖాతా నంబర్ ని (PAN) జత చేసినారా లేదంటే వెంటనే చేయండి ఎందుకంటే మీకు ఈ ఒక్క రోజే అవకాశం ఉంది.కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ తో PAN కార్డ్ ని లింక్ చేసుకునేందుకు గాను ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా జూన్ 30 వరకు గడువును ఇచ్చింది.2023 మార్చి నెలాఖరుకి లింక్ చేసుకోవలసి ఉండగా అప్పటివరకు లింక్ చేసుకోని వారికోసం మూడు నెలలపాటు గడువుని పొడిగించింది ప్రభుత్వం.జూన్ 30 కి కూడా ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయని వారు రూ.1000 ఫైన్ చెల్లించిన తరువాత వారి పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్ తో పాన్ కార్డ్ ని ఇప్పటి వరకు లింక్ చేయని ట్యాక్స్ పేయర్స్ యొక్క పాన్ కార్డ్ లు జూలై 1,2023 నుండి ఆదాయపన్ను సంస్థ నిభంధనల ప్రకారంగా పనిచేయదు.మీ పాన్ కార్డ్ పనిచేయని కారణంగా..

• లింక్ చేయని PAN లు పనిచేయవు,అందువలన వీటికి రీ-ఫండ్(Redund)లు ఇవ్వబడవు.

•PAN పనిచేయనందున రీ-ఫండ్ ఇవవలిసన సమయంలో వాపసు పై వడ్డీ ఇవ్వబడదు.

•TDS మరియు TCSలు అధిక రేటుతో తీసివేయబడతాయి లేదా

సేకరించబడతాయి.

అయితే,పాన్ రద్దయిన విషయం సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి రూ.1000 జరిమాన చెల్లించాలి ఆ తరువాత పాన్ కార్డ్ ని తిరిగి అమలు లోకి తీసుకు రావచ్చు.

ఆన్ లైన్ లో పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో క్రింద తెలిపిన విధంగా లింక్ చేయండి :

• భారత ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ eportal.incometax.gov.in ని ఓపెన్ చెయ్యండి.

• మీరు ఇప్పటికే అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసుకోకుండా ఉండి ఉంటే,వెంటనే వెబ్ సైట్ లో నమోదు చేసుకోండి.

• మీ యొక్క పాన్ కార్డ్ లేదా ఆధార్ సంఖ్యని యూజర్ ID గా పని చేస్తుంది.

• యూజర్ ID,పాస్ వర్డ్ మరియు పుట్టిన తేదిని ఉపయోగించడం ద్వారా పోర్టల్ కి లాగిన్ చేయండి.

• ఫోన్ స్క్రీన్ మీద పాప్-అప్ నోటిఫికేషన్ వస్తుంది అందులో ఆధార్ తో పాన్ కార్డ్ ని లింక్ చేయమని ఉంటుంది.ఒకవేళ మీకు

అది కనిపించక పోతే,హోమ్ పేజీకి ఎడమ వైపున ఉన్న ‘త్వరిత లింక్ లు’ విభాగానికి వెళ్ళండి.

• ‘లింక్ ఆధార్’ అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

• మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ప్రకారం మీ ఆధార్ నంబర్ మరియు మీ పేరును,మీ పాన్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేయండి.

• “ఆధార్ కార్డ్ లో కేవలం నా పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది.” అని ఉన్న బాక్స్ ని ఎంచుకోండి.ఒకవేళ ఆ ఆప్షన్ కి మీరు అర్హులు అనుకుంటేనే.

• Captcha కోడ్ ను సరిగా ధృవీకరించండి.

• మీరు నమోదు చేసిన వివరాలు, మీ పాన్ కార్డ్ మరియు ఆధార్ లో ఉన్న వివరాలు తేడా లేకుండా ఒకేలా ఉంటే మీరు మీ ఆధార్ కార్డ్ తో మీ పాన్ కార్డ్ ని సరిగ్గా అనుసంధానం (LINK) చేసినట్లే.

మీ PAN కార్డ్ విజయవంతంగా ఆధార్ తో లింక్ అయినట్లు నిర్ధారిస్తూ మీకు మెసేజ్ వస్తుంది.

PAN కార్డ్ లింక్ కోసం పెనాల్టీ:

కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ డిపార్ట్ మెంట్ ప్రకటన ప్రకారం, పౌరులు జూన్ 30 వరకు రూ.1000 రుసుముతో ఆన్ లైన్ లో వారి యొక్క ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయవచ్చు.

2022 మార్చి 31 కి ముందు ఆధార్-పాన్ లింక్ చేసుకోవడం ఉచితం.ఆ తరువాత 2022 ఏప్రిల్ 1నుండి రూ.500రుసుమును విధించారు తరువాత జులై 1,2022 నుండి రూ.1000 గా మార్చబడింది.

Leave A Reply

Your email address will not be published.