Telugu Mirror: సినీ పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ వారి పేరుని నిలదొక్కుకునే సామర్ధ్యం మాత్రం కొందరికే ఉంటుంది.తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్న అబ్బాస్ (Abbas) ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యాడు. అబ్బాస్ సినిమాలకు ఎందుకు దూరం అయ్యాడు ? ప్రస్తుతం అబ్బాస్ ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు అనే విషయాన్నీ మనం తెలుసుకుందాం.
మీర్జా అబ్బాస్ అలీ (Mirza Abbas Ali) అనే పేరు చెప్తే ఎవరికీ అర్ధం కాదు , ఎవరికీ తెలీదు కూడా కానీ అబ్బాస్ అని చెప్పగానే ప్రేమదేశం సినిమా గుర్తొస్తుంది.అబ్బాస్ 1975 మే 21 న కోల్కతా లో జన్మించారు. ప్రస్తుతం 47 సంవత్సరాలు ఉన్న ఈ లవర్ బాయ్ చిన్నతనం నుండే చదువు తో పాటు గా మోడలింగ్ పై ఆసక్తి చూపించారు. అబ్బాస్ బంధువులు కొందరు సినీ పరిశ్రమ లో పని చేస్తుండడంతో అతనకి కూడా సినిమా చేయాలనే కోరిక కలిగింది. యూత్ లో ఎంతగానో క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్ యుక్త వయసు రాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమిళ్ డైరక్టర్ కదీర్ (Tamil Director Kathir) ఒక కొత్త సినిమాలో నటీనటుల కోసం ఆడిషన్ ను ఏర్పాటు చేసారు.ఆ సినిమాకు నిర్మాత గా కుంచుమోహన్ మరియు AR రహ్మన్ సంగీతాన్ని అందించడం తో సినిమా పై ఆశలు పెంచుకొని అధిక సంఖ్యలోనే పాల్గొన్నారు. అబ్బాస్ వెంటనే తన రిలేటివ్స్ మద్దతు తో ఆడిషన్స్ లో పాల్గొన్న వెంటనే హీరో గా సెలెక్ట్ అయ్యాడు. వినీత్ మరియు అబ్బాస్ హీరోలుగా, టబు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కాదల్ దేశం.తెలుగు లో ‘ప్రేమ దేశం’ (Prema Desham) పేరుతో, హిందీ లో ‘దునియా దిల్వాలోన్ కీ’ తో ఒకసారి 3 భాషల్లో రిలీజ్ చేసారు. మొదటి మూడు రోజులు అసలు థియేటర్ మొఖం కూడా చూడని ప్రజలు నాలుగవ రోజు నుండి హౌస్ ఫుల్ అయ్యింది. మంచి కలెక్షన్స్ ను తీసుకురావడం తో పాటు అబ్బాస్ తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ని తన సొంతం చేసుకున్నాడు. వరుస సినిమా ఆఫర్స్ రావడం తో అబ్బాస్ ఫుల్ బిజీ అయ్యాడు కానీ సినిమా తీసేముందు కథ గురించి పట్టించుకోకుండా సినిమా తీయడం వల్ల అతని సినిమా కెరీర్ కు దూరం అయ్యాడనే చెప్పొచ్చు.
అబ్బాస్ భార్య అయిన ఎరం అలీ ఫాషన్ డిసైనర్ (Fashion Designer) వారికీ ఇద్దరు పిల్లలు.
సినిమా ఆఫర్ లు రాక చిన్న చిన్న పాత్రలలో చేసుకుంటూ , యాడ్స్ చేసుకుంటూ ఉన్నాడు. చివరగా మలయాళం సినిమా చేసి సినీ రంగానికి గుడ్ బాయ్ చెప్పి తన జీవితాన్ని కొనసాగించేందుకు న్యూజిలాండ్ లో స్థిర పడ్డాడు. మొదట్లో ఏ ఉద్యగం దొరకక పెట్రోల్ బంక్ లో కూడా పని చేసారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికుడిగా పని చేసి దాని పై పట్టు సాధించాడు. న్యూజిలాండ్ లో మంచి బిల్డర్ గా పేరొందిన అబ్బాస్ మోటివేషనల్ స్పీచ్ లు కూడా చెబుతారు.
ఏది ఏమైనప్పటికీ ప్రేమ దేశం సినిమా తో యూత్ కి ఎంతగానో దగ్గరయిన అబ్బాస్ కథలు సరిగ్గా ఎంచుకోపోవడం తో అతనికి దక్కిన పేరును అభిమానాన్ని అల్ప సమయం లో కోల్పోయాడు. అయినప్పటికీ తను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆర్థికంగా మరియు వేరే రంగం లో తనకంటూ ఒక కెరీర్ ను ప్రారంభించుకొని న్యూజిలాండ్ (Newzeland) లో సెటిల్ అయ్యారు.