ఏపీ లో కౌలు రైతులకు శుభ వార్త నేటి నుంచి రైతు భరోసా నగదు జమ

వైసిపి సర్కార్ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులకు శుభవార్త అందించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా నగదును విడుదల చేశారు. అర్హత పొందిన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయబడుతుంది. రైతు భరోసా కౌలు మరియు దేవాదాయ, అటవీ భూముల సాగు దారులకు రైతు భరోసా సహాయం చేస్తుంది.

Telugu Mirror: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉన్న కౌలు రైతులకు వైసీపీ సర్కార్ శుభవార్త చెప్పింది. సీఎం జగన్ (C.M Jagan) ఈరోజు రైతులకు రైతు భరోసాను అందించనున్నారు. ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయం నుండి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నారు. అర్హత కలిగిన రైతుల ఖాతాలలో నేరుగా నగదు జమ అవుతుంది. కేవలం కౌలు రైతులకే కాకుండా దేవాలయ భూములను సాగు చేసే రైతులకు కూడా రైతుభరోసా సాయం అందుతుంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కౌలుదారులు మరియు దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న 1,46,324 మంది రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి రూ.109.74 కోట్ల సహాయం ఒక్కొక్కరికి రూ.7,500, కౌలు మరియు దేవాదాయ, అటవీ భూముల సాగు చేసే రైతులకు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మూడు విడతల్లో రూ 13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో పంటల సాగు హక్కుల కార్డుల ను కౌలు రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సీసీఆర్సీ మేళాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. గ్రామాలలో ఆర్బీకే ల ద్వారా మేళాలు నిర్వహిస్తూ, ప్రతి కౌలు రైతుకు రుణం మంజూరు తోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే విధానంతో కౌలు కార్డులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కౌలు రైతులకు నూరు శాతం రుణాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఆర్బీకేలకు జోదించింది .

To provide crop cultivation rights cards to the tenant farmers, the andhra pradesh government is organising CCRC fairs.
image credit: istock, To provide crop cultivation rights cards to the tenant farmers, the andhra pradesh government is organising CCRC fairs.

Also Read: Hdfc Parivartan Programme: విద్యార్థుల నోట్లో చక్కెర పోసిన HDFC బ్యాంక్, రూ.75 వేల వరకు స్కాలర్ షిప్, వివరాలివిగో

రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం సుమారు 7.77లక్షల మంది రైతులకు కౌలు కార్డులు జారీ చేసింది. రైతుల యొక్క అన్ని వివరాలు రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేయబడ్డాయి. కానీ ముందుగానే రైతుల ఖాతాలలో నగదు జమ అవుతుంది. ఈ సంవత్సరం రూ.4వేల కోట్ల రూపాయల పంట రుణాలను కౌలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వం అర్హులైన ప్రతి కౌలు రైతుకు కార్డులను అందించింది. ప్రతి కౌలు రైతుకు పంట రునమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల (Welfare schemes) ను అందించాలని ఆదేశించింది. వై యస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళ సమయంలో 9 లక్షల మంది కౌలు రైతులకు 6,668.64 కోట్ల రూపాయల పంట రుణాలు అందించింది. వైయస్ఆర్ రైతు భరోసా క్రింద 3.92 లక్షలమంది కౌలు రైతులకు 529.07 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించింది.

అదేవిధంగా రూ.246.22 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ (input subsidy) ని ప్రభుత్వం 2.34 లక్షలమంది కౌలు రైతులకు అందించింది. రూ. 487.14 కోట్ల పంట భీమా పరిహారం 1.73 లక్షల మందికి ఉచితంగా అందించింది. అయితే రైతు భరోసా ఖాతాలలో కౌలు రైతులకు నగదు జమ చేస్తుండటంతో కౌలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం రూ.4 వేల కోట్ల పంట రుణాలు అందిచే లక్ష్యాన్ని పెట్టుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షెడ్యూల్ కంటే ముందుగానే రైతు భరోసా నిధులను విడుదల చేస్తుంది.

Leave A Reply

Your email address will not be published.