Bharath Rice : మార్కెట్ లోకి వచ్చిన భారత్ రైస్ కిలో రూ. 29కే, సామాన్యుడి ఆకలి తీరుస్తున్నమోడీ ప్రభుత్వం

దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ధరలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను 29 రూపాయలకే అందిస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం సన్నబియ్యంను "భారత్ రైస్" పేరిట మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యంను “భారత్ రైస్” పేరిట మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ రైస్ ను 29 రూపాయలకే అందిస్తుంది.

కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఢిల్లీ లోని కర్తవ్య పథ్ లో ఈ విక్రయాలను ప్రారంభించారు. కిలో సన్న బియ్యం 29 రూపాయలకే నాఫెడ్, ఎన్ సిసిఎఫ్ ద్వారా రిటైల్ కేంద్రాల్లో అమ్ముతుంది.

వీటితోపాటు ఈ – కామర్స్ వేదికలోను భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. భారత్ రైస్ ను 5 మరియు 10 కిలోల బ్యాగులో అమ్ముతున్నారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించడం జరిగింది.

గత సంవత్సరంతో పోలిస్తే బియ్యం హోల్ సేల్ ధరలు 15.7% మరియు రిటైల్ ధరలు 13.8% పెరిగాయి. నిత్యవసర సరుకుల ధరలను ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం (Inflation) అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ కారణంగానే సరసమైన ధరలకే భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇప్పటికీ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ తో తక్కువ ధరకు పప్పులు, ఉల్లిపాయలు, పిండి, టమాటాల ను విక్రయించడం జరిగింది.

Bharath Rice : Bharath rice which has come into the market is Rs. 29K, Modi government is satisfying the hunger of the common man
Image Credit : Nadunudi

ఇందులో భారత్ గోధుమ పిండిని గత సంవత్సరం నవంబర్ 6 న కేంద్రం ప్రారంభించింది. ఈ -కామర్స్ వేదికలో భారత్ బ్రాండ్ కు మంచి స్పందన రావడంతో, భారత్ రైస్ కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని భావిస్తుంది. భారత రైస్ (Bharath Rice) వలన సామాన్యులకు లాభం కలగనుంది. ఈ మధ్యకాలంలో సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి.ఈ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 26% వరకు పెరిగాయి. పాత బియ్యం కొనలేక, కొత్త బియ్యం తినలేక సామాన్య ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంట విస్తీర్ణం చాలా తగ్గిపోవడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కలిసి విక్రయదారులు ను ఇబ్బంది పెడుతున్నారు.

Also Read : Telugu Film Super Star Nagarjuna : మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుని లక్షద్వీప్ విహార యాత్రకు వెళుతున్న నాగార్జున; మోదీ పై వారు చేసిన వ్యాఖ్యలు ఆరోగ్యకరమైనవి కావని వ్యాఖ్య.

ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ఖరీదు రూ. 6,500 ఉంది. కొందరు బ్రోకర్లు దీనిని అదునుగా భావించి రైస్ మిల్లుల దగ్గర కొన్న ధర కంటే అదనంగా కేజీ కి 5 రూపాయల నుంచి 8 రూపాయల వరకు ఎక్కువగా విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో 25 కిలోల పాత బియ్యంను 1500 రూపాయల పైనే విక్రయిస్తున్నారు. గత ఏడాది సన్న బియ్యం కొత్తవి, ధర క్వింటాకు 3000 నుంచి రూ. 3500 వరకు ఉంది. పాత బియ్యం ధర రూ. 4200 వరకు ఉంది.

కానీ ప్రస్తుతం రూ. 6000 నుంచి రూ. 6500 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) దీనిని తీవ్రంగా పరిగణించి, సామాన్యులకు అందుబాటు ధరలో సన్న బియ్యం ను అందించాలని భావించి, కేజీ సన్న బియ్యం ను 29 రూపాయలకే భారత్ రైస్ పేరిట ప్రవేశపెట్టింది. దీంతో సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించింది.

Comments are closed.