Telugu Mirror: రష్యా ‘లూనా 25’ (Luna – 25) లూనార్ మిషన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రష్యా లూనార్ ప్రోబ్ ‘లూనా 25’ చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ (Roskosmos) ఈ విషయాన్ని ధృవీకరించింది. డేటాను నిశితంగా అలాగే జాగ్రత్తగా అధ్యయనం చేయడంలో తప్పు చేసినట్లు రష్యా అంతరిక్ష సంస్థ అంగీకరించింది.
చెదిరిన రష్యా కల
రష్యాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్ ప్రయోగించిన లూనార్ రోవర్ లూనా 25 కు నిన్న సమస్యలు ఎదురయ్యాయి అని ఆ సమస్యలకు పరిష్కారం లభించలేదు అని రోస్కో స్మోస్ అభిప్రాయ పడింది.’రోస్కోస్మోస్’ ప్రాథమిక అంచనాల ప్రకారం, లూనా 25 చంద్రుని దక్షిణ ధ్రువంపై కుప్పకూలిందని భావిస్తున్నారు
రష్యా 47 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను పంపింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, లూనార్ రోవర్ (Lunar Rover) ను రష్యా చంద్రునిపైకి పంపింది, కానీ అది ఫెయిల్యూర్ కు దారి తీసింది. రష్యాకు చెందిన లూనా 25 ల్యాండింగ్ చంద్రయాన్-3 కంటే ముందే జరుగుతుందని అంచనా వేశారు. అయితే రష్యా కల నెరవేరలేదు.
రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్ వెల్లడించిన ప్రకారం భారత కాల మానం ప్రకారం శనివారం సాయంత్రం 4:40 PM (IST) కి ల్యాండింగ్ కు ముందు అంతరిక్ష నౌకను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం జరిగిందని కానీ లూనార్ రోవర్ లూనా25 అనుకున్న కక్ష్యలోకి చేరలేదని వెల్లడించింది.
రష్యా యొక్క లూనా 25 ప్రోబ్ ఆగస్టు 21 న చంద్రుని దక్షిణ అర్ధగోళానికి సమీపంలోని బోగుస్లావ్స్కీ క్రేటర్ సమీపంలో భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ -3 కన్నా ముందుగా ల్యాండ్ చేయడానికి రష్యా ప్రణాళిక చేసింది .
శనివారం రాత్రి రోస్కోస్మోస్ అందించిన నివేదిక ప్రకారం, అంతరిక్ష నౌక ఇంజిన్‌లు ల్యాండింగ్‌కు ముందు లూనా 25 చుట్టూ భ్రమణం చెందించడానికి ప్రారంభించడం జరిగిందని. అయితే, ఈ నిరంతర ఆపరేషన్ లో అత్యవసర పరిస్థితి కారణంగా లూనా 25 చేరవలసిన కక్ష్యను చేరుకోలేకపోయింది
రష్యాకు చెందిన లూనా 25 ఆగస్టు 11న ప్రారంభించబడింది. రష్యా అంతరిక్ష నౌక ఆగస్టు 21 లేదా 22న చంద్రుడిపై అడుగు పెట్టవలసి ఉంది. అయితే, ఐదు దశాబ్దాల తరువాత రష్యా తలపెట్టిన చంద్రుని పై రహస్యాల శోధన యాత్రకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
ఉక్రెయిన్ (Ukraine) తో యుద్ధం తరువాత రష్యా తన మొదటి భారీ అంతరిక్ష యాత్రను మొదలు పెట్టింది. అయితే, ఈ అంతరిక్ష యాత్రలో రష్యా విజయం సాధించలేక పోయింది. రష్యా చేపట్టిన అంతరిక్ష నౌక ప్రయోగం ద్వారా భారత్ చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకోకముందే చంద్రుడిపైకి రష్యా తన లూనా 25ను పంపాలన్న కల చెదిరిపోయింది.