Telugu Mirror : దాదాపు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K.C.R) గారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యం లో భారత రాష్ట్ర సమితి (BRS) మేనిఫేస్టోను విడుదల చేసారు. దళిత బంధు, కెసిఆర్ భీమా వంటి కొన్ని ముఖ్యమైన పథకాలను (Schemes) కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికీ LIC ద్వారా రూ. 5 లక్షల కెసిఆర్ భీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రములో ఉన్న 93 లక్షల BPL (Below Poverty Line) కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున కెసిఆర్ భీమా ద్వారా లబ్ది చేకూరుతుందని చెప్పారు.
Also Read : World Students Day : అబ్దుల్ కలామ్ జయంతి రోజునే విద్యార్థి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా
దళితులు ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి లేక వ్యవసాయం లో పెట్టుబడులు పెట్టడానికి దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలను ఇస్తాము అని హామీ ఇచ్చారు. ఇవన్నీ రాబోయే 5 నెలల్లో తెలంగాణ బడ్జెట్ (Budget) లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వితంతువులకు, దివ్యంగులకు, వృద్దులకు పెన్షన్ (Pension) దశల వారీగా రూ.2016 నుండి 5 వేలకు మరియు 6 వేలకు పెంచనున్నారు. వచ్చే సంవత్సరం మార్చ్ నుండి సంవత్సరానికి రూ. 500 మరియు రూ. 300 చొప్పున పెంచుతారు. అర్హత కలిగిన దళిత మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మరియు జర్నలిస్ట్ లకి కేవలం రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి రూ.15 లక్షల రూపాయల భద్రతా బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అన్నపూర్ణ పథకం కింద అర్హులైన కుటుంబాలకు సన్న బియ్యం అందజేయనున్నారు. రైతు బంధు పథకంను 16 వేలకు పెంచారు. మొదటి సంవత్సరం రూ.12 వేల నుండి మొదలయి దశల వారిగా రూ.16 వేల వరకు పెరగనుంది. సౌభాగ్యలక్ష్మీ పథకం (Scheme) కింద బీపీఎల్ (BPL) కింద ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి అందిస్తాం. ప్రతి కుటుంబానికి నివాసం అనేది మొదటి మెట్టు కాబట్టి హైదరాబాద్ (Hyderabad) లో మరో లక్ష డబల్ బెడ్ రూమ్స్ (Double Bedrooms) ఇండ్లను నిర్మించేందుకు అండగా ఉంటానని కెసిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సీఎం కెసిఆర్ హుస్నాబాద్‌లో (Husnabad) ప్రారంభించడం అదృష్టంగా భావిస్తారు. ఈసారి కూడా ఎన్నికల ప్రచారం సిద్ధిపేట లోని హుస్నాబాద్ (Husnabad) నుండే ప్రారంభిస్తాం అని ఈరోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ (KCR) తెలియజేశారు.
Also Read : బ్యాంకులకు షాక్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూల్స్ అతిక్రమణలో భారీగా జరిమానా