PM Kisan Yojana Registration: PM కిసాన్ 14వ విడతతో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న కేంద్ర సర్కార్, నమోదు చేసుకోండిలా

Telugu Mirror : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం క్రింద రైతులకు రూ.6000 ఆర్థిక సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా నాలుగు నెలల లోపులో విడతకు 2వేలు చొప్పున మొత్తం మూడు విడతలుగా రూ.6,000 అందజేస్తారు. ప్రస్తుతం రైతులకు 14వ విడత నిధులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు.

కేంద్ర ప్రభుత్వం 14వ విడత PM కిసాన్ యోజన పథకం నిధులను జూలై 27న 8.5కోట్ల మంది రైతుల ఖాతాలలో 17వేల కోట్లకు పైగా డబ్బులను బదిలీ చేశారు. ప్రథాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) రాజస్థాన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని డీబీటీ పద్దతిలో రైతుల ఖాతాలలో జమ చేశారు. అయితే 15వ విడత నిధుల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పుడు నమోదు కార్యక్రమం ప్రారంభించింది.15వ విడత PM కిసాన్ యోజన నిధుల కోసం రైతులు PM కిసాన్ యోజన అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దానిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Pm Kisan 14 th time
Image Credit: India.com

PM కిసాన్ యోజన ఇలా నమోదు చేసుకోండి.

ముందుగా PM కిసాన్ యోజన అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళండి. మీకు వెబ్ సైట్ లో స్క్రీన్ పైన మూలలో ఫార్మర్స్ కేటగిరీ కనిపిస్తుంది. అక్కడ న్యూ ఫార్మర్ కేటగిరీ పై క్లిక్ చేయడం ద్వారా మీకు మీరే నమోదు చేసుకోండి. అక్కడ రూరల్ ఫార్మర్, అర్బన్ ఫార్మర్ ఆప్షన్ లలో మీరు గ్రామీణ ప్రాంతాల రైతు అయితే రూరల్ ఫార్మర్ ని, పట్టణ ప్రాంత రైతులు అయితే అర్బన్ ఫార్మర్ ఆప్షన్ ని ఎంచుకోండి. ఆ తరువాత మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి. తరువాత ఫోన్ నంబర్ నమోదు చేసి మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్న తరువాత గెట్ OTP పైన నొక్కండి. OTP నమోదు చేసిన తరువాత నమోదు కార్యక్రమం ఎంచుకుని మీకు స్క్రీన్ పైన వచ్చిన సమాచారాన్ని నింపాలి. ఇప్పుడు మీ ఆధార్ గుర్తింపు కోసం ఆగండి. తరువాత మీ డాక్యుమెంట్స్ ని అప్ లోడ్ చేసి సేవ్ బటన్ ను ప్రెస్ చేయండి. మీ దరఖాస్తు ఆమోదం పొందితే స్క్రీన్ పైన మెసేజ్ వస్తుంది.

e KYC చేయకుంటే వచ్చే విడత సొమ్ము కష్టమే

మీకు PM కిసాన్ యోజన పథకం తదుపరి విడత నిధులను పొందాలంటే మీరు తప్పక e-kyc ని ఆన్ లైన్ లో పూర్తి చేసుకుని ఉండాలి. లేని పక్షంలో మీకు వచ్చే విడత నిధులు మీ అకౌంట్ కు బదిలీ కావు. ఒకవేళ మీరు e -kyc పూర్తి చేయకుండా ఉంటే వెంటనే ఆ పనిని పూర్తి చేయండి. రైతులు తమ సమీప CSC సెంటర్లను లేదా PM కిసాన్ పోర్టల్ pmkisan.gov.inని సందర్శించి e-kyc పొందవచ్చు. అలాకాని పక్షంలో మీకు రాబోయే విడతలో PM కిసాన్ నిధులు రాక పోవచ్చు.

మీ ఖాతాలో PM కిసాన్ నిధులు మంజూరు కాకుంటే ఇక్కడ సంప్రదించండి.

మీరు PM కిసాన్ యోజన కు అర్హత కలిగి ఉండి , 14 వ విడత డబ్బులు మీ ఖాతాకు బదిలీ కాకుండా ఉంటే మీరు ఆందోళన పడకండి. 14వ విడత సొమ్ము కోసం లేదా మీకు ఏ విధమైన సహాయం మీకు అవసరమైన PM కిసాన్ సహాయ అధికారిక Email ID pmkisan-ict@gov.in ని సంప్రదించండి లేదా PM కిసాన్ యోజన-155261 లేదా, టోల్ ఫ్రీ నంబర్ 1800115526 కి లేని పక్షంలో 011-23381092 యొక్క హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించాలి. మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉంటే ఆగిపోయిన 14వ విడత సొమ్ముని తదుపరి విడతలో మీ ఖాతాకు బదిలీ చేస్తారు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in