ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను మార్చుకోవాలా, అయితే ఇలా ఈజీగా మార్చుకోండి

ఆధార్ కార్డ్ అనేది వివిధ ప్రభుత్వ పనులు మరియు కార్యక్రమాలకు అవసరమైన గుర్తింపులో కీలకమైన భాగం. మీ ప్రస్తుత ఆధార్ కార్డ్ ను  వీలైనంత త్వరగా మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయడం చాలా అవసరం.

Telugu Mirror : మీ మొబైల్ పోగొట్టుకోవడం వలన లేదా ఇంకేదైనా కారణం చేత మీరు నెంబర్ మార్చుకున్నట్లయితే మీరు మీ ఆధార్ కార్డుకి ఆ నెంబర్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఆధార్ కి సంబంధించిన పథకాలు మరియు  ప్రభుత్వ విధులకు సంబంధించిన  పనులు జరగకుండా ఆగిపోతాయి. కాబట్టి మీ ఫోన్ నెంబర్ ను ఆధార్ కార్డు కి లింక్ చేసుకోండి. మరియు ఎప్పుడూ అప్డేట్ లో ఉంచుకోండి.

మీ ఫోన్ నంబర్  ఆధార్ కార్డ్  లో ఎల్లప్పుడూ అప్ డేట్ లో ఉండేలా ఎందుకు చూసుకోవాలి?

ఆధార్ కార్డ్ అనేది వివిధ ప్రభుత్వ పనులు మరియు కార్యక్రమాలకు అవసరమైన గుర్తింపులో కీలకమైన భాగం. మీ ప్రస్తుత ఆధార్ కార్డ్ ను  వీలైనంత త్వరగా మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయడం చాలా అవసరం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, మీరు మీ ఆధార్ కార్డ్‌తో అనుబంధించబడిన (Associated) ఏదైనా సేవను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే, మీరు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు  వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది . మీరు సేవను యాక్సెస్ చేయడానికి,  ఈ OTPని నమోదు చేయాల్సి ఉంటుంది. కావున మీ ఆధార్ కార్డ్‌ అప్డేట్ లో వుందా లేదా, ఒకవేళ అప్డేట్ (Update) లో ఉన్నట్లయితే  మీ మొబైల్ నంబర్ ఆధార్ కి లింక్ అయి వుందా అనే విషయాన్ని తెలుసుకోవడం  చాలా అవసరం.

Also Read : Prevent Viral Diseases with Ayurveda : వైరల్ వ్యాదులను ఆయుర్వేద మూలికలతో నివారించండి ఇలా

మీ మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయకపోతే ఏం అవుతుంది?

మీరు మీ ఆధార్ కార్డ్‌లో మీ మొబైల్ నంబర్‌ను అప్డేట్ లో ఉంచుకోలేకపోతే, మీరు ఆధార్‌ కార్డు తో సంబంధించిన ఏ సేవలను ఉపయోగించలేరు. ఇలాంటి సేవలకు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) అవసరం ఉంటుంది, ఆ OTP మీరు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు జారీ చేయబడుతుంది. మీరు ఆ OTP ని నమోదు చేస్తే తప్ప ఆధార్‌ సంభందిత ఏ సేవలను యాక్సెస్ (Access) చేయలేరు. అందుకే మీ మొబైల్ నెంబర్ ను కచ్చితంగా ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి.

మీ ఆధార్ కార్డ్‌లో మీ మొబైల్ నంబర్‌ను ఆఫ్ లైన్ ద్వారా మార్చుకునే పద్దతిని తెలుసుకోండి..

మీరు ఆధార్ వెబ్‌సైట్‌ని ఉపయోగించి మీ మొబైల్ నంబర్‌ని అప్డేట్ చేయడం కుదరదు. మీరు ఆఫ్‌లైన్ పద్ధతులను ఉపయోగించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మీ ఆధార్ కార్డ్ లో మొబైల్ నంబర్‌ని ఆఫ్ లైన్ ద్వారా ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • ముందుగా మీ ప్రాంతంలో లేదా దగ్గర్లో ఉన్న ఆధార్ కార్డ్ సేవా కేంద్రాన్ని సందర్శించండి.
  • మీ ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేసుకోడానికి మరియు సవరణలు చేసుకోడానికి కేంద్రం దగ్గర నుండి ఫారం ను తీసుకోండి.
  • ఆ ఫారంలో,  మీ ఆధార్ లో మార్చాల్సిన మొత్తం  డీటెయిల్స్ ను పూరించండి.
  • పూర్తి చేసిన ఫారమ్‌ను కేంద్రంలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి అందజేయండి.
  • మీ అభ్యర్థనను ట్రాక్ చేయడానికి మీకు ఒక అభ్యర్థన నంబర్ (Request No) అందించబడుతుంది.
  • ఆ తర్వాత మీ ఆధార్ కార్డు, 7 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో అప్డేట్ అవుతుంది .

Also Read : Beauty Tips : ఎండవల్ల ముఖంపై ఏర్పడే టాన్ ను సింపుల్ గా ఇలా తొలగించండి, మెరిసే చర్మం స్వంతం చేసుకోండి

Comments are closed.