China Proposal : చిన్నారులకు ఇక స్మార్ట్ ఫోన్ వాడకం దూరం..’మైనర్ మోడ్’ ప్రపోసల్ తో చైనా…

Telugu Mirror : ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న దేశం చైనా(China). ఆరోగ్య నేపథ్యం వైపుగా చైనా ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. పిల్లలు స్మార్ట్ ఫోన్(Smart Phone) వాడకాన్ని కట్టడి చేసే ప్రతిపాదనను వెల్లడించింది. అది ఏమనగా,స్మార్ట్ ఫోన్ లను మైనర్ మోడ్ లో ఉంచవచ్చు మరియు దీని యొక్క ముఖ్య ఉద్దేశం పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు రెండు గంటలకన్నా మించి స్మార్ట్ ఫోన్ వినియోగించలేరు. ప్రస్తుతం దీనిపై ప్రజల యొక్క రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం సెప్టెంబర్ 2 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.

ISRO : చంద్రయాన్-3 బిగ్ అప్‌డేట్.. ఘనతకు చేరువలో ఇస్రో..

పిల్లలు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడాన్ని తగ్గించడం వలన మెరుగైన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు .స్మార్ట్ ఫోన్లతో అధిక సమయం గడపడం వల్ల పిల్లలకు డిప్రెషన్(Depression) మరియు ఆందోళన వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి. మానసిక ఆరోగ్యం మరియు వివిధ రకాల శారీరక సమస్యలు ,స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడటం వల్ల వస్తాయి.బ్రిటిష్ సైకలాజికల్ సొసైటీ(British Psychology society) ప్రకారం మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియాను వాడే పిల్లలు ,మరియు కౌమార దశ లో ఉన్నవారు,సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవడం, సరైన నిద్ర లేకపోవడం, నిరాశ, ఆందోళన ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు.

Image credit:CGTN

పిల్లలు స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించడం వల్ల భవిష్యత్తులో ఈ సమస్యలు రాకుండా వారిని కాపాడవచ్చు అని అంటున్నారు.అధికంగా ఫోన్లు చూడటం, సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం లాంటివి పిల్లలు చేస్తుంటే వాటి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి తల్లిదండ్రులు, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని వాటిని వాడకుండా చూడాలని పరిశోధకులు అంటున్నారు. పిల్లలే కాకుండా దాదాపుగా అన్ని వయసుల వారు స్మార్ట్ ఫోన్ లకు బానిస అయ్యారని, కరోనా (Corona)మహమ్మారి సమయంలో ఫోన్ వాడకం అధికమైందని పరిశోధకుల బృందం కనుగొంది.కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని చాలా దేశాల్లో స్మార్ట్ ఫోన్ వాడకం చాలా వేగంగా పెరిగిందని కనుగొన్నారు. వీటిలో చైనా, మలేషియా, సౌదీ అరేబియా ముందంజలో ఉన్నాయి అని అన్నారు.

One Plus Open : భారత్ లో OnePlus ఓపెన్..ప్రారంభానికి ముందే స్మార్ట్ ఫోన్ ధర లీక్..

పిల్లలే కాదు పెద్దవారు కూడా స్మార్ట్ ఫోన్ అతిగా వాడుతున్నారు అని అన్నారు.మూడు సంవత్సరాల నుండి కొనసాగుతున్న కరోనా వైరస్ సమయం నుంచి స్క్రీన్ వినియోగం ఎక్కువైందని మరి ముఖ్యంగా పిల్లలు అతిగా వాడటం అధికమైందని ఆరోగ్య నిపుణులు వ్యక్తపరిచారు. JAMA పీడియాట్రిక్స్(Pediatrics) లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కోవిడ్ మొదలైనప్పటినుండి పిల్లలు స్క్రీన్ లపై గడిపే సగటు సమయం 52 శాతం ఎక్కువ అయింది అని దీని వలన శరీరం మొత్తానికి మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని వెల్లడించారు.స్మార్ట్ ఫోన్లను అతిగా వాడటం వల్ల మెదడుపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని తేలింది. మొబైల్(Mobile) లను అధికంగా వాడటం వల్ల పిల్లలు మెదడు యొక్క అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

స్మార్ట్ ఫోన్, ట్యాబ్ మరియు లాప్టాప్ లలో వెలువడే బ్లూ రేస్(Blue Rays) వలన మెదడులోని ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయని మరియు నిద్ర నాణ్యత దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు .ఈ బ్లూ రేస్ ప్రభావం వల్ల నిద్ర నాణ్యత పై నేరుగా ప్రభావం పడుతుంది అన్నారు. అధికంగా స్మార్ట్ ఫోన్లు మరియు స్క్రీన్లను వాడే వ్యక్తులు వారి యొక్క జీవగడియారం మీద కూడా ప్రభావం పడుతుందని, దీని వలన అధిక రక్తపోటు, గుండెజబ్బులు వంటి వివిధ రకాల శారీరక సమస్యలతో పాటు అనేక రకాల తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది.కాబట్టి అన్ని వయసుల వారు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని పరిశోధకులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.