Telugu Mirror : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు చేయాలని ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మన అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు తెలంగాణ ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న విషయం గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.
ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతు భరోసా, మహాలక్ష్మి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ళు మరియు గృహ జ్యోతి వంటి పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారు. 8 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో దాదాపు కోటి కి పైగా దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ అభయహస్తం గ్యారెంటీలకు 1,05,91,636 దరఖాస్తులు మరియు ఇతర దరఖాస్తులు 19,92,747 వరకు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ డేట్ మొత్తాన్ని కంప్యూటరీకరణ చేస్తున్నారు. దాదాపు ఈ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ మధ్య సెలవు దినాలు రావడం వల్ల కొంత ఆగినప్పటికీ తొందర్లోనే ఈ పక్రియ పూర్తి కానుంది. అయితే ప్రజాపాలన చేసుకున్న ప్రతి ఒక్కరి తమ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాపరిపాలన అభయహస్తం వెబ్సైటులో విండోని ఓపెన్ చేసారు. వెబ్సైటులో దరఖాస్తునికి పూర్తి డేటాని నిక్షిప్తం చేసేలా కసరత్తు చేస్తుంది.
Also Read : Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త, రైతల ఖాతాల్లోకి రూ.15,000 జమ, ఎప్పటి నుండో తెలుసా?
అప్లికేషన్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలి?
- ముందుగా https://prajapalana.telangana.gov.in/ వెబ్సైటు విండోని ఓపెన్ చేయండి.
- ప్రజాపరిపాలన పోర్టల్ లో దరఖాస్తుని అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు “KNOW YOUR APPLICATION STATUS” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత క్యాప్చ ని ఎంటర్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసుకోండి.
డేటా ఎంట్రీ పూర్తి అయిన తర్వాత ఈ వెబ్సైటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు దరఖాస్తు గడువు తేదీ ముగిసింది కాబట్టి మళ్ళీ 4 నెలల తర్వాత ప్రజాపరిపాలన కార్యక్రమం మొదలవుతుందని అధికారులు తెలిపారు.
ఈ ఆరు గ్యారెంటీల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం సబ్ కమిటీ కూడా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నట్లుగా మరియు పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు సభ్యులుగా ఉంటున్నట్టు సమాచారం అందింది.
ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలపై ఎక్కువ దరఖాస్తలు వచ్చాయి. గత ప్రభుత్వంలో గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం తో మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలి. ఇంకా, రైతు బంధు పథకం కింద నిధులు తీసుకుంటున్న రైతులు రైతు భరోసాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ఈ పథకం పై దరఖాస్తులు తగ్గాయి.