Driving License New Rules: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పరిమితులను జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. డ్రైవర్లు RTO కార్యాలయాల్లో మాత్రమే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలల నుండి కూడా నుండి లైసెన్స్‌లను పొందే అనుమతిని కల్పించింది. అయితే, ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాల (Private Driving Schools) లు డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అందులో పాస్ అయినా వాళ్ళకి లైసెన్స్‌లను జారీ చేస్తాయి. ఆ మేరకు ప్రభుత్వం ఈ పాఠశాలలకు అధికారాలను మంజూరు చేసింది. అలాగే పాత ఆటోమొబైల్స్ (Auto Mobiles) పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అతివేగంగా వాహనాలు నడిపితే రూ. 1000 నుండి రూ. 2,000 వరకు జరిమానా విధిస్తారు.
మైనర్ డ్రైవింగ్ (Minor Driving) చేస్తూ పోలీసులకు పట్టుబడితే, అతను లేదా ఆమె రూ. 25 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతే కాదు ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. ఇంకా, ఆ మైనర్ కి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ చేయకూడదు అని ఆంక్షలు విధిస్తారు. ఇంతక ముందు లాగా కాకుండా లైసెన్స్ (License) లు పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియను తగ్గించనుంది. టూ-వీలర్ వాహనాల లేదా ఫోర్ -వీలర్ వాహనాల అనే దాన్ని బట్టి డాక్యుమెంటేషన్‌ను అందించాలి. ఒకటి రెండు చెక్ అప్ ల కోసం మాత్రమే RTO కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
Also Read: Uber Bus Services : ఉబర్ నుండి క్యాబ్ సర్వీసులే కాదు, ఇకపై బస్సు సర్వీసులు కూడా..
జూన్ 1వ తేదీ నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ నుంచి లైసెన్సులు పొందవచ్చు. ఈ పాఠశాలలు మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్‌లను మంజూరు చేస్తారు.
ఈ నియమం అన్ని ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకు వర్తించదు. ప్రభుత్వ అర్హత నిబంధనల ప్రకారం, పాఠశాలకు ఒక ఎకరం స్థలం ఉండాలి. ఫోర్ వీలర్ డ్రైవింగ్ (Four Wheellr Driving) కి రెండెకరాలు ఉండాలి.
ఈ పాఠశాలల్లో టెస్టింగ్ కి అన్ని సౌకర్యాలు ఉండాలి. ట్రైనర్స్ హై స్కూల్ విద్యను పూర్తి చేసి, కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. బయోమెట్రిక్స్ మరియు టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి.
లైట్ మోటర్ వెహికల్ (Lite Motor Vehicle) కి అయితే నాలుగు వారాల్లో 29 గంటల పాటు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందులో 21 గంటల డ్రైవింగ్ ప్లాన్ చేయాలి, మిగిలిన 8 గంటల థియరీ తరగతులు పెట్టేలా ప్లాన్ చేసుకోవాలి.
వెయిట్ మోటారు వాహనాలకు 31 గంటల ప్రాక్టికల్ శిక్షణ అవసరం. థియరీ తరగతులు 8 గంటల పాటు ఆరు వారాల పాటు శిక్షణ ఉండాలి.
ఈ షరతులకు అనుగుణంగా డ్రైవింగ్ స్కూల్ ఆపరేటర్లు https://parivahan.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.