tirumala no fly zone: తిరుమల మీదుగా విమానాలు ఎందుకు వెళ్లవు? కారణం ఇదే..!

పురాతన పుణ్యక్షేత్రం అయినా తిరుమల మీదుగా విమానాలు వెళ్లవు. అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? ఇప్పుడే తెలుసుకోండి.

tirumala no fly zone: కలియుగ దైవంగా కొలువుదీరిన వేంకటేశ్వర స్వామి (Venkateswar Swamy) ని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమల (Tirumala) కు వస్తుంటారు. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు కాలినడకన ఏడుకొండలను ఎక్కి ప్రార్థనలు చేసి కానుకలు ఇస్తారు. దేవుడికి వేలాది మంది ప్రజలు తలనీలాలు సమర్పిస్తారు. కొంతమంది తమ మొక్కు చెల్లించడానికి బంగారం, డబ్బు, ఫోన్లు మరియు గడియారాలను హుండీలో కానుకల రూపంలో వేస్తున్నారు.

తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తిరుమల భక్తులతో మరింత రద్దీగా మారింది. తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. ప్రతి రోజు తిరుమలలో భక్తుల విపరీతంగా పెరిగిపోతూ ఉంది.

మరి, మీకు ఒక విషయం తెలుసా? తిరుమల మీద నుండి ఫ్లైట్స్ (Flights) గాని, హెలికాఫ్టర్లు (Helicopter) గాని ఎగరవు. ఇందుకు కారణం ఏంటో మీకు తెలుసా? అయితే, ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గత ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ఉన్నప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు తిరుమలని No fly Zone గా ప్రకటించమని సెంట్రల్ గవర్నమెంట్ ని అప్పీల్ చేశారు. అయితే, అప్పీల్ చేసిన 3 సంవత్సరాల వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఏపీ ప్రభుత్వం మళ్ళీ 2015లో ఆ అప్పీల్ ని రీట్రై చేశారు. ఇక 2016లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తిరుమల పురాతనమైన పుణ్యక్షేత్రం అయినప్పటికీ దీనికి No fly Zone గా ప్రకటించలేమని అప్పీల్ ని రిజక్ట్ చేసింది.

Also Read: Cheif Ministers Salary: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాల ఎంతో తెలుసా?

ఒకవేళ తిరుమలని అలా అప్పీల్ చేస్తే వేరే ఇతర పుణ్యక్షేత్రాల నుండి కూడా ఇలాంటి అప్పీల్స్ వస్తాయని అందరు అనుకుంటూ ఉంటారు. అయితే, తిరుమలను No fly Zone గా ప్రకటించామని కోరడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయని టీటీడీ చెబుతుంది. అందులో మొదటిది ఆగమ శాస్త్రం ప్రకారం, వెంకటేశ్వర గుడి (Venkateshwara Temple) మీదుగా ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఎగురకూడదు అని రాసి ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే, ప్రతి రోజు కొన్ని వేల సంఖ్యలో తిరుమలను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తారు. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల టెర్రరిస్ట్ ల దాడి జరుగుతుందనే ఉద్దేశంతో No fly Zoneగా ప్రకటిస్తే బాగుంటుంది అని తెలిపారు.

అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తిరుమలని అధికారికంగా No fly Zoneగా ప్రకటించనప్పటికీ ఎయిర్ లైన్ కంపెనీస్ తిరుమల మీదుగా ఎలాంటి విమానాలు వెళ్లకుండా జాగ్రత్త పడతాయి.

Comments are closed.