Sudipta Mohanty: ఛీ.. ఛీ..ఇదేం డాక్టర్..ఇండో అమెరికన్ డాక్టర్ ని అరెస్ట్ చేసిన FBI

Telugu Mirror: గత ఏడాది హవాయి(Hawai)నుండి బోస్టన్‌(Boston)కు వెళ్లే విమానంలో 14 ఏళ్ల బాలిక ముందు హస్తప్రయోగం చేశాడనే ఆరోపణలపై కేంబ్రిడ్జ్ లో నివసిస్తున్న భారతీయ అమెరికన్ డాక్టర్ (Indo American Doctor)ను అరెస్ట్ చేశారు.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బోస్టన్ అధికారిక (FBI) ఖాతా నుండి చేసిన ఒక ట్వీట్‌లో, అరెస్టు గురించి తెలిపింది. ఇండో అమెరికన్ డాక్టర్, గత ఏడాది హవాయి నుండి విమాన ప్రయాణంలో 14 ఏళ్ల బాలిక ఎదురుగా అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డాడని బోస్టన్ FBI పేర్కొంది.  బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టులో ప్రాథమిక విచారణ నిమిత్తం హాజరు తర్వాత

ఆ డాక్టర్ ను విడుదల చేసినారు. డాక్టర్ పై అసభ్యకరమైన చర్యలకు సంభందించిన

నేరం రుజువైతే 90 రోజుల జైలు శిక్ష విధించబడుతుంది, ఆపై ఒక సంవత్సరం ఆంక్షలతో కూడిన స్వేచ్ఛను ఇస్తారు, (ఇటీవలే ప్రిజన్ నుండి విడుదల అయినవారికి) మరియు అత్యధికంగా $5,000 (డాలర్ల) వరకు జరిమానా విధిస్తారు.

మసాచుసెట్స్‌(Massachusetts)లోనికేంబ్రిడ్జ్‌(cambridge)లో 33సంవత్సరాల వయస్సు గల డా. సుదీప్త మొహంతి(Sudipta Mohanty) నివసిస్తున్నారు, అతను మే 27, 2022న హవాయి ఎయిర్‌లైన్స్ విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించారు. అనుచితమైన ఈ సంఘటన విమాన ప్రయాణ సమయంలో జరిగినట్లు కోర్ట్ కు నివేదించబడింది. హోనోలులు నుండి బోస్టన్‌కు విమానంలో ప్రయాణిస్తున్న అతను తనంతటతాను జననాంగాలను బహిర్గతపరచి, ఒక యువతి సమక్షంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడు. అని ఈ కేసులో గురువారం బోస్టన్ ఫెడరల్ కోర్టు లో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Image credit:Boston globe

Also Read:Land Acquisition Act:భూ బాట సమస్యలతో బాధపడుతున్నారా? చట్టరీత్యా పరిష్కారం ఇప్పుడు మీ కోసం

సుదీప్త మొహంతిపై అభియోగాలు మైనర్ బాలిక ఆరోపణల ప్రకారం

ఫ్లైట్‌లో దాదాపు 5 గంటల తర్వాత, మొహంతి దుప్పటిని తన మెడవరకు కప్పుకున్నాడని. ఈ సమయంలో, ఆమె అతని కాలు పైకి క్రిందికి కదలడం గమనించానని, కొంత సమయం తరువాత దుప్పటి జారిపోయి మొహంతి ప్యాంటు జిప్ తీసి ఉండి అతని జననాంగాలు బయటపడ్డాయని తెలిపింది. ఆ సమయంలో  “జుగుప్సగా మరియు చాలా అసౌకర్యం” కలిగి, వెంటనే వేరే సీటుకు మారినట్లు తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో డాక్టర్. మొహంతి భుజంపై తలపెట్టి పడుకున్న ఒక మహిళా సహచరి పక్కన కూర్చుని ఉన్నట్లు బాలిక వివరించింది. విమానం బోస్టన్‌కు చేరగానే మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించిన ఈ సంఘటన గురించి తెలిపింది. కుటుంబ సభ్యులకు తెలపడం వలన, వారు ఫిర్యాదు మేరకు ఇది చట్ట సంస్థల ప్రమేయానికి దారితీసింది.

FBI అధికారుల నివేదికల ప్రకారం, ఈ విషయం పై ప్రశ్నించగా ‘నాకు ఆ సంఘటన గుర్తు లేదు’ అని మొహంతీ స్పందించారు.

US యాక్టింగ్ అటార్నీ జాషువా లెవీ ప్రాథమిక కోర్టుకు హాజరైన తరువాత చేసిన ప్రకటనలో ఈ విధంగా వెల్లడించారు. “ప్రయాణ సమయంలో జుగుప్సను కలిగించే ప్రవర్తనకు లోనవకుండా ఉండేందుకు ప్రతి మనిషికీ, ప్రత్యేకించి పిల్లలకు పూర్తి హక్కు ఉంది.”

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బోస్టన్ డివిజన్‌కు చెందిన యాక్టింగ్ స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్ క్రిస్టోఫర్ డిజెన్నా ఈ సంఘటన “క్షమించరానిది, నైతికంగా ఎంతో తప్పైనది, షేమ్ లెస్” గా పేర్కొంటూ ఒక కఠిన ప్రకటన విడుదల చేశారు. అరెస్ట్ ద్వారా స్పష్టమైన సందేశం వెలువడుతుందని గట్టిగా ఉద్ఘాటించారు. FBI విమానంలో జరిగే నేరాలను తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ సందర్భంలో లైంగిక దుష్ప్రవర్తన అలాగే దాడి, విమాన సిబ్బందితో ఘర్షణ పడటం, వారి పనులలో కలుగజేసుకోవడం మరియు దొంగతనం వంటి అనేక నేరాలను FBI తీవ్రంగా పరిగణ లోకి తీసుకుంటుందని, అరెస్ట్ ద్వారా స్పష్టమైన సందేశం వెలువడుతుందని ఆమె ఉద్ఘాటించారు.

సుదీప్త మొహంతి ఎవరు?

కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, మొహంతి అంతర్గత వైద్యం మరియు ప్రైమరీ కేర్ డాక్టర్ గా బోస్టన్ లో ప్రాక్టీస్ చేస్తాడు. అతనిపై వచ్చిన ఆరోపణల ప్రకారం మే 27, 2022న, హవాయి ఎయిర్‌లైన్స్ విమానంలో హోనోలులు నుండి బోస్టన్ వెళ్లే మార్గంలో ఒక మహిళా సహచరితో పాటు మొహంతీ ప్రయాణీకుడిగా ఉన్నారని. తన గ్రాండ్ పేరెంట్స్ తో కలసి ప్రయాణిస్తున్న 14 సంవత్సరాల మైనర్ బాలిక పక్కన కూర్చున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, బాలిక గ్రాండ్ పేరెంట్స్ బాలికకి కొంత సమీపంలో కూర్చొని ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.