Animals Smuggling: విదేశీ జాతి జంతువుల స్మగ్లింగ్ పై పట్టుబడ్డ వ్యక్తి, షాకింగ్ న్యూస్.

Telugu Mirror: సాధారణంగా మనం చూసే వార్తల్లో డ్రగ్స్ , గంజాయి లాంటివి సరఫరా చేస్తారని వింటాం. అలా సరఫరా చేయడం చట్టరిత్యా నేరమని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వింతగా మరో స్మగ్లింగ్ (smuggling) ఘటన పై నెట్టింట తెగ వైరల్ న్యూస్ గా మారింది. అడవి జంతువుల స్మగ్లింగ్ గురించి మీకు తెలుసా ? ఈ ఘటన పై పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇది వన్యప్రాణుల స్మగ్లింగ్ (smuggling) యొక్క విషాద సందర్భం. తమిళనాడు కి చెందిన ఒక వ్యక్తి అడవి జంతువులను స్మగ్లింగ్ చేసి పోలీసులకు పట్టుబట్టాడు. వన్యప్రాణుల స్మగ్లర్ ఒక (బాల కంగారు (Little Kangaroo) లేదా వాలబీ (Wallaby) )ని ఒక సూట్‌కేస్ లోపల బ్యాంకాక్ (Bangkok) నుండి బెంగళూరు (Banglore) విమానాశ్రయానికి తీసుకువెళ్లాడు. ఆ సమయం లో ఒక చిన్న కంగారూ ఊపిరాడక మరణించిందని వెల్లడించారు. భయంకరమైన జంతువుల స్మగ్లింగ్ కి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు . అదనంగా విషపూరితమైన జంతువులు అనగా నాగుపాములు, మొసళ్లు, తాబేళ్లు మరియు బల్లులతో సహా 233 సర్పాలు అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం లో ఆ వ్యక్తి పట్టుబడడు. విమానాశ్రయ అధికారులు ఆ వన్య ప్రాణులను రక్షించి వాటి ప్రాణాలను కాపాడగలిగారు.

Image Credit: cnn

 

Also Read:Cinema Download : సినిమా డౌన్లోడ్ చేసే సమయంలో మోసగాళ్ళ వలలో పడకండివన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kempegowda International Airport Bengaluru) ని కస్టమ్ అధికారులు అసాధారణమైన సరీసృపాలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఎయిర్‌పోర్టు రాకపోకల ప్రాంతం నుంచి బయటకు వచ్చే గేటు గుండా వెళ్లబోతుండగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.విదేశీ జాతులకు చెందిన ఆ ప్రమాదకరమైన ప్రాణులను చూసి అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ పట్టుపడ్డ పాములు, బల్లులు మరియు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాల ప్రకారం నిందితుడు 32 ఏళ్ల వ్యక్తి. అతడు ఆగష్టు 21న రాత్రి సమయం లో ఎఫ్ డి -137 విమానం లో బ్యాంకాక్ నుండి ప్రయాణించాడు. పెద్ద ట్రాలీ బ్యాగ్‌తో ప్రయాణిస్తున్న వ్యక్తిపై అనుమానం కలిగింది. అదే సమయంలో ఆ వ్యక్తి “గ్రీన్ ఛానల్ ” ద్వారా వెళ్లడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. “గ్రీన్ ఛానల్ ” అంటే డ్యూటీ-బౌండ్ లేదా నిషేధిత వస్తువుల కేటగిరీల కిందకు వచ్చే ఉత్పత్తులను నివేదించడానికి మరియు ఎటువంటి ఉత్పత్తులు లేని ప్రయాణీకుల కోసం నియమించబడిన మార్గం. ఘటనకు సంబంధించి బెంగళూరులోని విమానాశ్రయం థాయ్‌ ఎయిర్‌ఏషియా లో ప్రయాణిస్తూ ట్రావెలర్‌పై అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.