Maha Lakshmi Scheme Details: తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభం, స్కీం రిజిస్టర్ కోసం కావాల్సిన డాక్యూమెంట్స్ ఏంటో తెలుసుకోండి

మహాలక్ష్మి స్కీమ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీలలో ఒకటి. మహాలక్ష్మి స్కీమ్ వల్ల మహిళలకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

Telugu Mirror : తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Chief minister Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి స్కీమ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీలలో (6 guarantees) ఒకటి, ప్రత్యేకంగా మహిళలని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ ని ప్రేవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర నూతన సీఎంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన్న తర్వాత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను  ఆర్డర్ కాపీ పై సంతకం చేసిన తరువాత మహాలక్ష్మి పథకం యాక్టివేట్ చేయబడింది.

మహాలక్ష్మి స్కీమ్ (Maha Lakshmi Scheme) వల్ల మహిళలకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి, ప్రతి ఇంట్లోని కుటుంబ పెద్దకు రూ.2500 ప్రతి నెలా వారి బ్యాంక్ ఖాతా లోకి  జమ అవుతుంది, అంతే కాకుండా 500రూపాయలకె సబ్సిడీ ధరకు నిరుపేదలకు గ్యాస్ సిలిండర్లను అందించనున్నారు. తెలంగాణ రాష్ట్ర (Telangana State) వ్యాప్తంగా మహిళలలు ఈ మహాలక్ష్మి  స్కీమ్ ద్వారా ఉచితంగా తెలంగాణలో ఏ జిల్లాకు అయిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. ట్రాన్స్ జెండర్స్ కి కూడా ప్రయాణం ఉచితంగా ఉంటుంది. రాష్ట్రం అంతటా ఈ స్కీంను డిసెంబర్ 9న ప్రారంభించిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డి  అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉప ముఖ్యమంత్రి మల్లి భట్టి విక్రమార్క తో కలిసి సోనియా గాంధీ 77వ జయంతి సందర్భంగా ఉచిత బస్ స్కీమ్ ని అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి తన క్యాబినెట్లోని ఎమ్మెల్యేలతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు బస్సులో ప్రయాణించి, అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తిరిగి అసెంబ్లీకి చేరుకున్నారు.

Also Read:ఆధార్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్, ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి తేదీ

మహాలక్ష్మి స్కీం కొరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్ధలు మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. రిజిస్టర్ చేసుకొనే వెబ్సైట్ లింకు అధికారంగా ఇంకా ఆక్టివేట్ అవ్వలేదు, మీరు అపట్టి వరకు ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని ఉంచుకోండి. ఆధార్ కార్డు (Aadhar Card) , ఓటరు ఐడీ (Voter id) , కుల ధృవీకరణ పత్రం (Cast Certificate) , ఆదాయ ధృవీకరణ పత్రం (income Certificate) , రేషన్ కార్డు (Ration Card) , గ్యాస్ కనెక్షన్ రుజువు (Gas Connection) , ఆధార్ తో జతచేయబడిన మొబైల్ నెంబరు మరియు దరఖాస్తుదారుడు భారత పౌరుడై, తెలంగాణ వాసి అయి ఉండాలి.

మహాలక్ష్మి పథకం తెలంగాణ కర్ణాటకలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ లక్ష్మి పథకాన్ని పోలి ఉంటుంది,ఇందులో నగదు ప్రయోజనం మరియు మహా లక్ష్మి పథకానికి మరో 2 అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

Comments are closed.