అతిలోక సుందరి కి అరుదైన బహుమతి ఇచ్చిన గూగుల్.. నేడు అందాలనటి శ్రీదేవి జయంతి.

Telugu Mirror : భారత దేశ దిగ్గజ నటీమణుల లో ఒకరైన దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి(Sridevi) జయంతి నేడు. భారత దేశ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్న నటి శ్రీదేవి 60వ జయంతి సందర్భంగా Google ప్రత్యేక డూడుల్‌ను విడుదల చేసింది. తమిళనాడులో ఆగష్టు 13,1963లో జన్మించిన శ్రీదేవి తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో సుమారు మూడు వందల సినిమాలలో నటించిన ఆమె బాలీవుడ్(BollyWood) లో మొదటి మహిళా సూపర్ స్టార్ గానిలిచింది. సినీ నిర్మాత బోనీ కపూర్‌(Boney Kapoor)ను పెళ్ళాడిన శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు జాన్వి కపూర్ మరియు ఖుషీ కపూర్ లు ఉన్నారు.

Tollywood Actors Died In Small Age:చిన్న వయసులోనే మృత్యు ఒడిలో చేరిన తారలు వీరే.

టెక్ దిగ్గజ సంస్థ గూగుల్(Google) ముంబైకి చెందిన అతిథి కళాకారిణి భూమికా ముఖర్జీకి డూడుల్ ఇలస్ట్రేషన్‌ను అందించింది, ప్రసిద్ధి చెందిన ఆమె డ్యాన్స్ భంగిమలో ఉన్న డిజిటల్ ఆర్ట్ వర్క్ తో దిగ్గజ నటికి నివాళులు అర్పించింది.నాలుగు సంవత్సరాల వయస్సులోనే శ్రీదేవి నటించడం ప్రారంభించింది, శ్రీదేవి మొదటి చిత్రం 1967లో కందన్ కరుణై అనే తమిళ చిత్రం. కెరీర్ ప్రారంభంలో, ఆమె తమిళం, తెలుగు మరియు మలయాళం చిత్రాలలో వైవిధ్య మున్నపలు పాత్రలలో నటించింది.

గూగుల్ డూడుల్(Google Doodle) తన వివరణలో ఇలా రాసింది,” గురు మరియు శంకర్‌లాల్ వంటి సినిమాలు విజయం సాధించిన తరువాత శ్రీదేవి మరియు ఆమె సహ నటులు హిట్ చిత్రాలతో మరింత ప్రసిద్ధి చెందారు. ఆ సమయంలో తమిళ సినిమా సూపర్ స్టార్‌ గా విస్తృతంగా వెలుగొందుతున్న శ్రీదేవి యొక్క ఆన్-స్క్రీన్ చరిష్మా హిందీ భాషా చిత్ర పరిశ్రమలోని నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించింది.

Image Credit : Hindusthan Times

హిందీ చిత్ర పరిశ్రమలో కి వెళ్ళక ముందే స్టార్ హీరోయిన్ గుర్తింపును పొందిన శ్రీదేవి 1976లో కె. బాలచందర్‌(k.Balachandar) దర్శకత్వం వచ్చిన మూండ్రు ముడిచు చిత్రంలో కథానాయికగా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తరువాత 1983లో, యాక్షన్ కామెడీ చిత్రం హిమ్మత్‌వాలాలో లీడ్ రోల్(lead role) లో నటించిన శ్రీదేవి తర్వాత, శ్రీదేవి తనను తాను నేషనల్ ఐకాన్ గా మరియు బాలీవుడ్‌లో బాక్సాఫీస్(Box Office) దగ్గర తన ఆకర్షణతో వసూళ్ళ రాబడిలో తన స్టార్ స్టేటస్ నిలబెట్టుకుంది.

Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల

శ్రీదేవి నటించిన హిట్ చిత్రాలలో సద్మా, చాల్‌బాజ్, మిస్టర్ ఇండియా, నగీనా, చాందిని, లమ్హే ఇంకా మరెన్నో చిత్రాలు ఉన్నాయి.”పురుషాధిక్యత ఆనవాయితీగా వస్తున్న బాలీవుడ్ పరిశ్రమలో హీరోలేకుండా హీరోయిన్ ఓరయంటెడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేరాఫ్ చేసిన ఏకైక బాలీవుడ్ నటీమణులలో శ్రీదేవి ఒకరు” అని గూగుల్ తెలిపింది.

Image Credit : pinkvilla

2000వ సంవత్సరం ప్రారంభంలో, నటనకు విరామం ఇచ్చిన శ్రీదేవి 2012లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో అద్భుతంగా తిరిగి సినిమాలలో పునరాగమనం చేసింది. అంతకు ముందు 2004లో మాలినీ అయ్యర్ అలాగే కబూమ్ వంటి టి.వి. షోలలో కూడా నటించింది.

2013లో భారత ప్రభుత్వం శ్రీదేవిని పద్మశ్రీ(Padma Sri) అవార్డుతో సత్కరించింది. 2017లో ‘మామ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఆమె కోపాన్ని అదుపులో పెట్టుకోలేని మరియు రక్షణగా ఉండే తల్లి పాత్ర ను పోషించింది. ఈ చిత్రంలో శ్రీదేవి ప్రదర్శించిన నటనకు, 65 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.గూగుల్ పేర్కొంది, “ భారత చలనచిత్ర పరిశ్రమలో మహిళలు లేడీ ఓరయంటెడ్
సినిమాలలో నటించడానికి కొత్త ఒరవడిని సృష్టించడం ద్వారా శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ చెరగని తనదైన ముద్ర వేశారు . చిత్ర పరిశ్రమలోని భారతీయ నటులలో ఒకరిగా ఆమె తన నటనా కాలంలో గుర్తుండిపోతుంది.” అని గూగుల్ పేర్కొంది.

Jailer Movie : ఆగష్టు 10 న రజనీ సునామి ‘జైలర్’ సినిమా విడుదల..చైన్నై,బెంగళూరులో ఆఫీసులకు సెలవు.

2018లో, దుబాయ్ వెళ్లిన శ్రీదేవి తను బస చేసిన హోటల్ లోని బాత్ టబ్ లో స్పృహ కోల్పోయి ప్రమాద వశాత్తు మునిగి చనిపోయిందని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. శ్రీదేవి ఆకస్మిక మరణం ఆమె అభిమానులను మరియు భారత చలనచిత్ర పరిశ్రమలోని ఆమె సహ నటులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 2018 ఫిబ్రవరి 28 న ప్రభుత్వ లాంఛనాలతో బాలీవుడ్ సూపర్ స్టార్(Bollywood Super Star) గా వెలుగొందిన నటి శ్రీదేవి అంత్యక్రియలు ముంబయి లో జరిగాయి.

Leave A Reply

Your email address will not be published.