Hdfc Parivartan Programme: విద్యార్థుల నోట్లో చక్కెర పోసిన HDFC బ్యాంక్, రూ.75 వేల వరకు స్కాలర్ షిప్, వివరాలివిగో
Telugu Mirror: ఆర్థికంగా వెనుకబడి చదువులకు ఎవరూ దూరం కాకూడదని అలాగే కుటుంబ కలహాలతో లేదా ఇతర కారణాల వలన చదువులకు ఎవరు స్వస్తి పలక కూడదు అనే సదుద్దేశంతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ (HDFC Bank) వారు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. ఆర్థికంగా మరియు ఇతర కారణాల రీత్యా బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు చదువులలో రాణించేందుకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. పరివర్తన్ ప్రోగ్రాం (Parivartan Programme) క్రింద ఉపకార వేతనాలు అందిస్తూ విద్యార్థులకు చేయూతను ఇస్తుంది.HDFC అందించే పరివర్తన్ ఉపకారవేతనాలకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
HDFC బ్యాంక్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్షిప్ (Scholarship) కోసం 1వ తరగతి నుంచి డిగ్రీ,పీజీ వరకు చదువుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్ షిప్ (ECS) పథకంలో భాగంగా HDFC బ్యాంక్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ECS ఉపకార వేతనాల పథకం క్రింద విద్యార్థులకు ఏడాదికి రూ.75,000 వరకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆర్ధిక సాయం అందనుంది.
HDFC బ్యాంక్ పరివర్తన్ స్కాలర్ షిప్ వివరాలు:
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పరువర్తన్ స్కాలర్ షిప్ స్కూల్ ప్రోగ్రాం
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి .
స్కాలర్ షిప్: 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రూ.15,000 అందిస్తారు.
7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రూ .18,000 అందిస్తారు.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్ షిప్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం
అర్హత: 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చదివే వారు అర్హులు.
స్కాలర్ షిప్: డిప్లొమా చదివే వారికి రూ.20,000.
గ్రాడ్యుయేషన్ చదివే వారికి రూ.30,000
ప్రొఫెషనల్ కోర్స్ లు చదివే వారికి రూ.50,000 చెల్లిస్తారు.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్ షిప్ పీజీ ప్రోగ్రాం
అర్హత: 55 శాతం మార్కులతో పీజీ మరియు మాస్టర్స్ డిగ్రీ చదివే వారు అర్హులు
స్కాలర్ షిప్ : పీజీ కోర్సులు చదువుతున్న వారికి రూ.35,000
ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.75,000 చెల్లిస్తారు.
హెచ్ డి ఎఫ్ సి పరివర్తన్ ప్రోగ్రాం స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునే విధానం
అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆర్థిక స్థోమతను పరిగణలోకి తీసుకుంటారు అలాగే సంస్థ యొక్క నిబంధల ప్రకారం ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 30-09-2023
Also Read:7th Pay Comission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, త్వరలో డీఏ, డీఆర్ పెంపు
దరఖాస్తు చేసుకునేందుకు కావలసిన పత్రాలు:
– పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
– గత సంవత్సరం మార్కుల మెమో (2022-23)
– ఆధార్ కార్డు
ప్రస్తుత సంవత్సరానికి సంభందించిన పత్రాలు
• ఫీజు రసీదు
• అడ్మిషన్ లెటర్
• సంస్థ ఐడెంటిటీ కార్డు (Indentity card)
• బోన ఫైడ్ సర్టిఫికెట్ (ప్రభుత్వ స్కూల్ వారికి)
• బ్యాంక్ పాస్ బుక్ (18 సంవత్సరాల లోపు వారికి తండ్రి అకౌంట్ అయినా సరిపోతుంది)
• ఆదాయ ధ్రువీకరణ పత్రం
• వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
• గడచిన మూడు సంవత్సరాల కాలంలో కుటుంబ కలహాలతో
లేదా గొడవలు తదితర కారణాలతో ఇబ్బంది పడుతున్న
విద్యార్థులకు ప్రాధాన్యత కలిగి ఉంటుంది.