Helpful News For Telangana Farmers 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర పథకాలకు పుట్టినిల్లుగా నిలుస్తోంది. దీంతోపాటు నిరుపేదలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచారు.
ఆ తర్వాత అభయహస్తం పేరుతో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రజలకిచ్చిన ఆరు హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రైతులకు శుభవార్త అందించింది.
తెలంగాణ రైతులకు ఒక శుభవార్త.
పంట రుణాలపై రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు కీలక ప్రకటనలు జారీ చేసింది. గతంలో కంటే ఎక్కువ పంట రుణాలు అందించాలని సూచించింది. ఎకరా వరికి కనిష్టంగా రూ.42 వేలు, గరిష్టంగా రూ.45 వేలు పంట రుణాలు ఇవ్వాలని సూచించారు.
రాష్ట్రంలో వరి తర్వాత అత్యధికంగా పండించేది పత్తి పంటే కాగా, రైతులకు రూ. 44-46 వేలు తెల్ల బంగారానికి ఇవ్వాలని, మొక్కజొన్నకు రూ. 32-34 వేలు, మిర్చికి గరిష్టంగా రూ. 80 వేలు, పసుపు పంటకు రూ.87 వేలు. గత నెల 13న సచివాలయంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు నాబార్డు, రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ, రాష్ట్ర సహకార బ్యాంకు సభ్యులతో సమావేశమయ్యారు.
ఏ పంటకు ఎంత మొత్తం ఋణం ఇవ్వాలి?
ఈ సమావేశంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, పెరిగిన రవాణా, కూలీల ఖర్చులను బట్టి ఏ పంటకు ఎంత మొత్తంలో రుణం ఇవ్వాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత, రాష్ట్రంలో సాగు చేసే వివిధ పంటలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 2024-25కి సంబంధించి రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫండింగ్) నిర్ణయించడం జరిగింది. వానాకాలం, యాసంగి సీజన్‌కు కొత్త రుణ పరిమితులు విధించాలని ఇటీవల అన్ని బ్యాంకులు, డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాలకు కమిటీ చైర్మన్ రఘునందన్‌రావు, కన్వీనర్ మురళీధర్‌లు లేఖలు పంపారు.
పశుసంవర్ధక, మత్స్య శాఖలకు రుణ పరిమితి పెంపు
ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య శాఖలకు రుణ పరిమితిని పెంచారు. గతంలో ఒక యూనిట్ (20 మేకలు, ఒక పొట్టేలు)కు రూ.21-23 వేలు రుణం అందించగా… దాన్ని ఇప్పుడు రూ.22-24 వేలకు పెంచారు. గొర్రెల యూనిట్‌కు రూ.24-26 వేలు, పందుల యూనిట్‌కు రూ.57-59 వేలు రుణం మంజూరు చేయాలని కమిటీ సూచించింది.