Hyderabad DEO Orders: పిల్లల బడి ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇంజినీరింగ్ (Engineering), ఎంబీఏ కోర్సుల (M.B.A Courses) కోసం మధ్యతరగతి తల్లిదండ్రులు పెట్టిన ఖర్చులు ఇప్పుడు ఎల్ కేజీ, యూకేజీ చదువులకే వెచ్చిస్తున్నారు. స్కూల్ ఫీజులే అనుకుంటే. ఈ యూనిఫామ్, బూట్లు, బెల్టులు మరియు పుస్తకాల కోసం అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది.
ఇంకా, స్కూల్స్ లో ఏదైనా వేడుకలు, అకేషన్స్ ఉంటే ప్రత్యేకమైన డ్రెస్ మరియు కాస్ట్యూమ్స్ కి మరికొంత కొంత డబ్బు ఖర్చు అవుతుంది. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే ఆశతో ఉన్న తల్లిదండ్రులకు ఇవన్నీ ఇబ్బందులు గా మారుతున్నాయి. తమ పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కష్టపడి పని చేసే మధ్యతరగతి తల్లిదండ్రుల (Middle Class Parents) కు ఈ అదనపు ఖర్చులు భారంగా మారుతున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫాం, షూ, బెల్టుల అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. లాభాపేక్ష లేకుండా స్టేషనరీ, పుస్తకాలు విక్రయించవచ్చని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల (స్టేట్, CBSC, ICSC) ప్రాంగణంలో యూనిఫారాలు, బూట్లు మరియు బెల్ట్‌లను ఇకపై అమ్మడానికి అనుమతి లేదు.
#Telangana– Order
No Private school management ( state/ CBSE, ICSE) running in Hyderabad should ask parents to buy uniforms, shoes, belts etc in school. No sale inside the school premises, primarily.
Sale of books, stationery- should be a non profit, non-loss bases. pic.twitter.com/XCXb6bOnUd
— @Coreena Enet Suares (@CoreenaSuares2) May 31, 2024
Also Read: Education Loan : మీ పిల్లల చదువుకి లోన్ కావాలా? అయితే, వెంటనే అప్లై చేసుకోండి
హైదరాబాద్ జిల్లాలోని స్టేట్ సిలబస్ (State Syllabus) , సిబిఎస్‌ఇ (CBSE) , ఐసిఎస్‌ఇ సిలబస్ (ICSE Syllabus) ను బోధించే ఏ ప్రైవేట్ పాఠశాలల్లోను యూనిఫాంలు, షూలు, బెల్టులు అమ్మకుండా చూడాలని డీఈవో రోహిణి (DEO Rohini) అధికారులను కోరారు. అయితే, స్టేషనరీ మరియు పుస్తకాలు వంటి వస్తువులను పాఠశాల యాజమాన్యంలోని కౌంటర్ల ద్వారా ‘నో-లాస్స్, నో-ప్రాఫిట్’బేసిస్ మీద విక్రయించవచ్చని తెలిపారు. ఫీజుల నియంత్రణకు కమిటీ వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల చెల్లింపులకు ప్రభుత్వం పేమెంట్ మెకానిజం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కోర్టు ఆదేశాల మేరకు, పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు, నోట్‌బుక్‌లు (Note Books) మరియు స్టేషనరీ (Stationery) విక్రయాలు అన్నీ నాన్- కమర్షియల్ గా మరియు లాభాపేక్ష లేకుండా ఉండాలి. ప్రైవేట్ పాఠశాలలపై తరచూ పర్యవేక్షణ చేసేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉప విద్యాశాఖాధికారులను కోరారు. పాఠశాలల్లో యూనిఫారాలు (Uniforms) , షూలు (Shoes) , బెల్టులు (Belts) , ఇతర వస్తువులను అమ్మకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా, నిబంధనలు ఉల్లంఘిస్తే త్వరగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.