Telugu Mirror : విద్య ,ఉద్యోగ రంగాల లో ట్రాన్స్ జండర్(Trans Genders) లకు ప్రత్యేక రిజర్వేషన్ లను ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ కు తెలిపింది.ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్(Reservation) కేటగిరీల ప్రకారం వాటి పరిధిలోకి ఉంటేనే ట్రాన్స్ జెండర్ లు రిజర్వేషన్ ల యొక్క ఉపయోగాలను పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు తెలియజేసింది.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (NALSA) VS యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా సుప్రీం కోర్ట్(Supreme Court) ఆదేశాలను అమలుచేయనందుకు కోర్ట్ ధిక్కరణ కేసు పిటిషన్ కి జవాబుగా కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్(Affidavit) లో పై విషయం తెలిపింది.విద్య,ఉద్యోగ రంగాలలో ట్రాన్స్ జెండర్ లకు ప్రత్యేకంగా రిజర్వేషన్ లను ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు అఫడవిట్ సమర్పించింది.ట్రాన్స్ జెండర్ లు షెడ్యూల్ కులాలు(SC ), షెడ్యూలు తెగలు (ST ), వెనుకబడిన వర్గాలకు (BC), మరియు ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన (EWS)వారు అయితే రిజర్వేషన్ ఫలాలు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం(Central Government) అఫడవిట్ లో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో డైరెక్ట్ నియామక విషయాలలో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లలో అడ్మిషన్ లలో రిజర్వేషన్ ల నిష్పత్తి ఈ విధంగా ఉన్నాయి – షెడ్యూల్డ్ కులాలు (SC)-15 శాతం; షెడ్యూల్డ్ తెగలు (ST) వారికి 7.5 శాతం; సామాజికంగా అలాగే విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (SEBC ) 27% మరియు EWS వారికి 10 శాతం గా ఉన్నాయి.
పైన తెల్పిన నాలుగు రిజర్వేషన్ లతో సహా రిజర్వేషన్ యొక్క ఏదైనా ఉపయోగాలను దేశంలో అట్టడుగున ఉన్నవారితో సహా ట్రాన్స్ జండర్ లు మరియు అర్హత(Eligibility) కలిగిన జనాభా పొందవచ్చు అని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా కోర్ట్ కు సమర్పించిన అఫడవిట్ లో కేంద్రం పేర్కొంది.లింగమార్పిడి చేసుకున్న వారికి విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ నియామకాలలో రిజర్వేషన్ లను వర్తింపజేయాలని వారిని సామాజికంగా మరియు ఆర్ధికంగా వెనుకబడిన పౌరులుగా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Cancer : అలర్ట్.. అధిక చక్కెర అత్యంత ప్రమాదం..కాన్సర్ కు కారణమవ్వనుందా ?
కానీ సుప్రీం కోర్టు ఆదేశాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేయడంతో ట్రాన్స్ జెండర్ లు సుప్రీం కోర్టు ను ఆశ్రయించగా,సుప్రీం కోర్టు 2022 మార్చి లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు నోటీసుల(Notice)ను పంపించింది.అయితే కేంద్ర ప్రభుత్వం తన అఫడవిట్ లో 2014 నుంచి ట్రాన్స్ జండర్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మరియు వారికోసం నేషనల్ పోర్టల్(National Portal) ప్రారంభించడం,ట్రాన్స్ జండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 ని అమలు చేయడం వారి సంక్షేమం కోసం విధానాలను రూపొందించడం అలాగే వారు గౌరవ ప్రదమైన జీవితాన్ని జీవించడం కోసం తీసుకుంటున్న చర్యలు ఇంకా తదితర విషయాలను అఫడవిట్ లో ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం.ఈ విషయం మీద 2023 ఆగష్టు 18న సుప్రీమ్ కోర్టు తదుపరి విచారణ జరుపుతుంది .