lakhpati didi Scheme: మహిళలకు రూ.5 లక్షలు, ఇలా దరఖాస్తు చేసుకోండి

మహిళలను లక్షాధికారులుగా మార్చాలనే ఉద్దేశ్యంతో 2023లో కేంద్ర ప్రభుత్వం లక్ పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

lakhpati didi Scheme: పేద మరియు వెనకబడిన  తరగతులకు ప్రభుత్వం పథకాలను మరియు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి. వాటి వల్ల కూడా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. మన అందరికీ తెలిసిన ఓ పథకమే డ్వాక్రా గ్రూప్ (dwakra group) . ఇందులో తక్కువ వడ్డీకే (Low Interest) ఎక్కువ రుణాలు ఇస్తుంది.
ఇందిరమ్మ హయాంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ఇప్పటికీ మంచి దారిలో నడుస్తుంది.

  • మహిళలను లక్షాధికారులుగా మార్చాలనే ఉద్దేశ్యంతో 2023లో కేంద్ర ప్రభుత్వం లక్ పతి దీదీ (lakhpati didi) పథకాన్ని ప్రారంభించింది.
  • ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖదే.
  • ఈ కార్యక్రమాన్ని మొదట్లో ప్రారంభించినప్పుడు, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రెండు కోట్ల మంది మహిళలకు సహాయం అందించడం దీని ప్రాథమిక లక్ష్యం.
  • 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాజాగా మధ్యంతర బడ్జెట్‌లో, సుమారు మూడు కోట్ల మంది మహిళలకు రుణాలు అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు.
  • 18 మరియు 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మరియు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నవారు లక్ పతి దీదీ పథకానికి అర్హులు.

udyogini-yojana-good-news-for-women-under-the-yojana-the-employee-will-get-rs-3-lakhs-financial-assistance

Also Read:Sick Leave For Air India Staff: ఎయిర్ ఇండియా సిబ్బంది సిక్ లీవ్, 70 కి పైగా సర్వీసులు రద్దు

ఈ పథకానికి అర్హత పొందడానికి కావలసిన పత్రాలు:

  • బ్యాంకు పాస్‌బుక్ (Bank Pass Book),
  • ఎస్‌హెచ్‌జి నుండి సభ్యత్వ కార్డు, ఆధార్ కార్డ్ (Aadhar Card) మరియు
  • కుల దస్తావేజు,
  • ఫోన్ నంబర్
  • పాస్‌పోర్ట్‌ ఫోటోలు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ పథకం ద్వారా రుణం పొందడం కోసం, మీరు మీ ప్రాంతంలోని మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కార్యాలయానికి వెళ్లాలి.
లక్ పతి దీదీ స్కీమ్ ఫారమ్‌ను తీసుకోవాలి మరియు అవసరమైన సమాచారాన్ని పూరించాలి.
ఆ తరువాత, పత్రానికి అవసరమైన పత్రాలను జోడించండి, ఆపై దానిని సంబంధిత అధికారులకు అప్పగించండి.
మీ దరఖాస్తు ఫారమ్‌ను సమీక్షించిన తర్వాత, వడ్డీ లేకుండా రుణం పొందడానికి మీరు అర్హత కలిగి ఉన్నారో లేదో అధికారులు నిర్ణయిస్తారు.

lakhpati didi Scheme

Comments are closed.