Lower Berth Seats: ప్రతిరోజు, లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే రైలులో ప్రయాణిస్తున్నారు. కానీ, భారతీయ రైల్వే వినియోగదారులకు అందించే కొన్ని ప్రధాన సేవల గురించి చాలా మందికి తెలియదు. దాదాపు ఎక్కువ ప్రయాణికులు రైలు ప్రయాణం చవకైనదని మరియు సులభంగా ఉంటుందని అనుకుంటారు.
అందుకే దూర ప్రయాణీకులు రైళ్లను ఎంచుకుంటున్నారు. పండుగల సమయంలో, రద్దీగా ఉండే రైల్వే లైన్ల (Railway Line) లో రద్దీని తగ్గించడానికి అదనపు రైళ్లు జారీ చేస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అంతే కాదు, అవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. తొందరగా గమ్యాన్ని చేరుకుంటారు. రైలు ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు.
భారతీయ రైల్వే (Indian Railway) లో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడి అవసరాల ఆధారంగా రైల్వేలు నిబంధనలను రూపొందించాయి. యువకుల (Youth) నుంచి వృద్ధుల (Oldage) వరకు అందరూ రైలు ప్రయాణం చేస్తున్నారు. రైల్వేలు వృద్ధుల కోసం ప్రత్యేక సేవలను కూడా అందిస్తాయి.
మీరు సీనియర్ సిటిజన్ (Senior Citizen) అయితే లేదా వృద్ధ తల్లిదండ్రుల కోసం రైలు టిక్కెట్‌లను బుక్ చేస్తుంటే, లోయర్ బెర్త్‌ను రిజర్వ్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ, చాలా మంది లోయర్ బర్త్ (Lower Berth) కావాలని ప్రయత్నిస్తారు కానీ దాన్ని పొందలేరు.
Also Read: Indian Railways : మీకు తెలుసా? రైలు టిక్కెట్టుపై ఉండే 5 అంకెల అర్ధం ఏమిటో?
రైల్వేలు వృద్ధులకు సహాయం చేయడానికి అనేక విధానాలను అమలు చేస్తున్నాయి. పై సీటు పొందాలనుకునే వారు ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బర్త్ లు కేటాయిస్తున్నారని ఐఆర్సీటీసీ తెలిపింది. ఒక కస్టమర్ తన మామయ్యకు కాలు సమస్య కారణంగా రైలు టిక్కెట్టు రిజర్వ్ చేస్తున్నప్పుడు లోయర్ బెర్త్ ఎంచుకున్నాడని, అయితే రైల్వే అతనికి పై బెర్త్‌ను కేటాయించినట్లు సోషల్ మీడియా (Social Media) లో చెప్పాడు. ఈ పోస్టుపై రైల్వే శాఖ స్పందిస్తూ. జనరల్ కోటాలో టికెట్ రిజర్వ్ చేసుకుంటే.. సీట్లు ఉంటేనే సీటు కేటాయిస్తామని తెలిపింది. సీటు రాకపోతే సీటు రాదని అంటున్నారు.
మీరు రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద బుక్ చేస్తే, మీకు లోయర్ బెర్త్ లభిస్తుంది అని తెలిపింది. సీటింగ్ మొదట వచ్చిన వారికి మాత్రమే అందుతుంది. పబ్లిక్ కోటాలో బుక్ చేసుకునే వ్యక్తులు అందుబాటులో ఉంటేనే వారికి సీట్లు కేటాయిస్తారని రైల్వే ఏజెన్సీ (Railway Agency) పేర్కొంది. ముందుగా వచ్చిన వారికే ముందుగా సీట్లు కేటాయిస్తారు. దీని ఆధారంగానే బెర్త్‌లు అందజేస్తారు. పబ్లిక్ కోటా కింద సీట్లు పొందడంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. లోయర్ బెర్త్ కోసం TTEని కూడా సంప్రదించవచ్చు.