Mega Family Heroes: మెగాస్టార్ ఫ్యామిలీలో హీరోలు ఎంతమంది? తెలుగు ఇండస్ట్రీ మొత్తం వీరే..!

చిరంజీవి ఫ్యామిలీ చాలా పెద్దది. ఇప్పుడు వారి వారసులు ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో నటులుగా నిలిచారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది హీరోలు మెగా కుటుంబం నుండే వచ్చారు.

Mega Family Heroes:  మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మరియు అతని ఫ్యామిలీకి ఎంతో అరుదైన గౌరవం ఉంటుంది. ఎవరి అండ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చిన చిరంజీవి ఇప్పుడు కొన్ని కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, స్వయం కృషిని నమ్ముకొని సినీ పరిశ్రమకి వచ్చి వెండి తెర పై ఎన్నో సినిమాలు చేశారు.

అయన పడిన కష్టం ఊరికే పోలేదు. అతను పడ్డ కష్టానికి వెండి తెరపై మెగా స్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)  గా పేరుపొందారు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎంత పేరు తెచుకున్నాడో అతని కుటుంబ సభ్యులు కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. అయితే, చిరు కుటుంబంలో ఎంత మంది హీరోలు గా ఎదిగారు అని విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి ఫ్యామిలీ చాలా పెద్దది. ఇప్పుడు వారి వారసులు ప్రస్తుత సినీ ఇండస్ట్రీ (Cinema Industry) లో నటులుగా నిలిచారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది హీరోలు మెగా కుటుంబం నుండే వచ్చారు.

Also Read: Narayana Health Hospital : దేశంలో ఎక్కడా లేదు, కుటుంబ సభ్యులందరికీ బీమా కవరేజీ

చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి అతని వారసులు వస్తున్నారంటే సినీ ప్రేక్షకులకి అభిమానులకు ఆనందం అనే చెప్పాలి. అయితే,సినీ ఇండస్ట్రీకి చిరంజీవితో మొదలు ఆయన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , నాగబాబు (Naga Babu) కూడా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. వాళ్ళతో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ (Ram Charan) , నాగబాబు (Naga Babu) కొడుకు వరుణ్ తేజ్ (Varun Tej) కూడా ఇండస్ట్రీకి వచ్చారు.

ఇక చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా ఇండస్ట్రీకి వచ్చారు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ (Vyshnav Tej) కూడా ఉప్పెన మూవీతో అడుగు పెట్టి మంచి హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీలో నిలిచారు.

ఇక ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Arvind) కుమారులు అయిన అల్లు అర్జున్ (Allu Arjun), అల్లు శిరీష్ (Allu Sirish) కూడా సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్నారు. మెగా కుటుంబం నుండి ఇంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ (Ram Charan) మరియు అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నారు. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) కూడా సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు.

సాధారణంగా, టాలీవుడ్ ఇండస్ట్రీ (Tolly Wood Industry) లో ఒక కుటుంబం నుండి ఒకరు లేదా ఇద్దరు వస్తారు. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన ముద్ర వేసుకున్నారు.

Comments are closed.