Telugu Mirror : మనిషికి ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఊహించడం కష్టం. ఒక్క ప్రమాదాలే కాకుండా అవసరాలు కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా వస్తాయి. ఎప్పుడు ఏ ఆపద సంభవించినా, ఏ అవసరం ఏర్పడినా సురక్షితంగా బయటపడే శక్తిని కలిగి ఉండడం ముఖ్యం. ఇందుకు హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు(Health,Term Insurance Policies) ఆపద్భాందవులు గా నిలుస్తాయి.
ఎప్పుడైనా అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తి కుటుంబం వీధుల పాలు కాకుండా టర్మ్ పాలసీ(Term Policie) ఆదుకుంటుంది. టర్మ్ పాలసీ ద్వారా నామినీకి అందే డబ్బుతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి పాలసీలకు గురించిన పూర్తి సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ దారులకు, లేదా నామినీలకు చెప్పరు. అయితే ఈరోజు టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోడం కోసం ఏమి చేయాలి అనే విధానం, నామినీ(Nominie) లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
PM Vishwakarma Yojana : చేతి వృత్తుల వారికి మొదటి సారి కేంద్రం చేయూత..అర్హులు వీరే
– ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం
పాలసీదారులు చనిపోతే, మొదటిగా ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఈ విషయాన్ని తెలియపరచాలి.ఇది ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అత్యంత కీలకమైన దశ. అయితే ఇక్కడ గమనించ వలసిన అంశం ఏమిటి అంటే పాలసీ ఫోర్స్ లో ఉండాలి అలాగే ప్రీమియంలన్నీ సకాలంలో చెల్లించి ఉంటేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
– క్లెయిమ్ ఫారం, అవసరమైన పత్రాలు
మరణించిన వ్యక్తి తాలూకు నామినీ ఎవరైతే ఉన్నారో వారు క్లెయిమ్ ఫారంను ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్(Official Website) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా దగ్గరలోని కంపెనీ బ్రాంచ్ నుంచి పొందవచ్చు. క్లెయిమ్ ఫారం నింపిన తర్వాత, అవసరమైన పత్రాలను జతచేసి అందజేయాలి. వయసు నిర్ధారణ ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రం, అసలైన(Original) పాలసీ డాక్యుమెంట్లు, పాలసీదారు మరణానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ (వర్తిస్తే), నామినీ లేదా లబ్ధిదారుని గుర్తింపు పత్రాలు.
క్లెయిమ్ ఫారం పూర్తి చేసిన క్లెయిమ్ ఫారంలో నామినీ యొక్క పూర్తి వివరాలను సక్రమంగా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాత.అవసరమైన అన్ని పత్రాలను జతచేసి సమీక్ష కోసం ఫారంను ఇన్సూరెన్స్ కంపెనీ కి అందజేయాలి.
– క్లెయిమ్ అసెస్‌మెంట్(Claim Assessment)
క్లెయిమ్ ఫారం, డాక్యుమెంట్లను అందజేసిన తరువాత , ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను పరిశీలించి అంచనా వేయడం ప్రారంభిస్తుంది. పాలసీదారుల మరణానికి గల కారణాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. నిశ్చతత్వ విధానం లో మినహాయింపు పొటెన్షియల్ పాలసీ కోసం చూస్తుంది. ఆత్మహత్య లేదా హత్య వంటి సమయాలలో పూర్తి స్థాయి విచారణ కోసం అదనపు మెడికల్ లేదా లీగల్ డాక్యుమెంట్లు అవసరం కావచ్చు.
AP CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఉచిత బస్ పాస్ సౌకర్యం..తోడుగా పెన్షన్ కానుక రూ.10000/-
– క్లెయిమ్ రిజెక్షన్(Claim Rejection)
టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమైన సేఫ్టీ ని కలిగి ఉన్నప్పటికీ , ఒక్కోసారి క్లెయిమ్ తిరస్కరణ కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే పాలసీ తీసుకునే సమయంలోనే కంపెనీకి సంపూర్ణమైన సమాచారం అందించాలి. అన్ని ఫారంలను సందేహం లేకుండా, ఖచ్చితంగా,దాపరికాలు లేకుండా నింపాలి. అవసరమైన వివరాలను సక్రమంగా ఇవ్వనప్పుడు, సరి అయినవి కానప్పుడు క్లెయిమ్ రిజక్షన్‌లకు ప్రధాన కారణం అవసరమైన వివరాలను సక్రమంగా ఇవ్వనపుడు,సరియినవి కానప్పుడు తిరస్కరణకు గురి అవుతుంది.
– క్లెయిమ్ సెటిల్‌మెంట్(Claim Settlement) (30 రోజులలోపు)
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) వారు ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ లను 30 రోజులలో స్థిరపరచాలని టైమ్ లైన్ విధించింది. క్లెయిమ్ కు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన్నప్పటి నుండి ఈ టైమ్ పిరియడ్ ప్రారంభం అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు తమ యొక్క అంచనా ను పూర్తి చేస్తారు. 30 రోజులలోగా క్లెయిమ్ ఖరారు చేసి పూర్తి చేయక పోతే, ఇన్సూరెన్స్ కంపెనీ పీనల్ ఇంట్రెస్ట్ తో లెక్క ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.