Rain Falls in Telugu States: అన్నదాతలకు వాతావరణ కేంద్రం అద్భుతమైన వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల్లో (Three Days) తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా. వాతావరణ కేంద్రం మూడు రోజుల వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరిక బులెటిన్‌ను విడుదల చేసింది.
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే రైసీమకు రుతుపవనాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి బుధవారం ఉదయం మధ్య తిరుపతిలో 8.82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు ఏపీ, తెలంగాణలను తాకే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వికారాబాద్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలో ఈరోజు వర్షం (Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:Andhra Pradesh Farmers : ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ!
ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు మీదుగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల చురుకైన రుతుపవనాలు ఏర్పడవచ్చని వెల్లడించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad) లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, మోతీనగర్, బోరబండ, అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీల్లో వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మాదాపూర్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, మోతీనగర్, బోరబండ, అయ్యప్ప సొసైటీ, హైటెక్ సిటీల్లో వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.
ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి, రేపు చాలా జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములు మరియు బలమైన గాలులు ఉండవచ్చు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వివిధ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ ఈదురుగాలులు, తేలికపాటి నుండి భారీ వర్షపాతం ఉంటుంది.