Raithu Bandu On May 8th: మే 8న రైతు బంధు నిధులు విడుదల, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత

సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పై కీలక ప్రకటన చేసారు. 4 లక్షల మందికే రైతు బంధు అందాలని స్పష్టం చేశారు.

Raithu Bandu On May 8th: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం  (Telangana Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేలు అందించే రైతు భరోసా (Raithu Barosa)  పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం (B.R.S Government) ప్రారంభించిన రైతు బంధు పథకంలో భాగంగా రైతు బంధువుకు చెల్లించాల్సిన మొత్తం నగదు కొంత మంది రైతులకు డబ్బులు అందాయి. అది కూడా చాలా మంది రైతులకు అందుబాటులోకి రాలేదు.

అయితే, హామీలపై నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం రైతు బంధు విషయంలో కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెట్లు, రోడ్లు, గుట్టలు, పెద్దపెద్ద భూ యజమానులకు రైతు బంధు అందిస్తున్నారని చెప్పికొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పు మళ్ళీ చేయకుండా రైతు భద్రత కోసం 5 ఎకరాల లోపు ఉన్న సాగు భూములకు మాత్రమే రైతు బంధు అందుతుందని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది.

Raithu Barosa 10 Days

తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పై కీలక ప్రకటన చేసారు. ఇప్పటి వరకు రైతుబంధు లబ్ధిదారులు 69 లక్షల మంది ఉండగా, అందులో 65 లక్షల మందికి రైతు బంధు డబ్బులు అందినట్లు చెప్పారు. ఇంకా 4 లక్షల మందికి మాత్రమే రైతుబంధు అందాలని చెప్పుకొచ్చారు. మే 8 లోగా మిగిలిన వారికి అందజేస్తామని సీఎం ప్రకటన చేసారు. రైతుబంధు నిధులు ప్రారంభం అయి 3 నెలలు కావొస్తున్నా ఇంకా అందరికీ అందలేదు.

ఎన్నికల ప్రచారం కారణంగా నిధులు విడుదల కాస్త ఆలస్యం అయిందని, అదీ కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు రాగానే వెంటనే జీతాలు వేయడంతో ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు నిధులు అందినట్టు తెలుస్తుంది. మే 8 లోగా మిగిలిన వారికి రైతు బంధు డబ్బులు అందజేస్తామని, ఆగష్టు 15 నాటికి రుణమాఫీ (Runa Mafi) కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

రుణమాఫీ కోసం రూ. 32 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకు రుణాలుగా తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Comments are closed.