తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ తరుపున గెలిచి 2023 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. జెడ్పీటీసీ (ZPTC) గా మొదలయిన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి (Cheif Minister) పదవికి ఎదిగింది. ఒక మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎలా ఎదిగారు? రాజకీయాలకి ముందు ఆయన ఏం చేశారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా (Mahaboob Nagar District) కొండా రెడ్డి పల్లి దగ్గర గంగూర్ అనే చిన్న గ్రామంలో 1969 నవంబర్ 8న జన్మించారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. రేవంత్ రెడ్డి కి ఏడుగురు అన్నదమ్ములు ఒక చెల్లి ఉన్నారు. వీరిది సాధారణ ఒక మధ్య తరగతి కుటుంబం. ముందుగా, తన కెరీర్ ని ఒక పెయింటర్ (Painter) గా మొదలు పెట్టాడు. ఆ తర్వాత, ఈయన ప్రింటింగ్ ప్రెస్ (Printing Press) ని స్థాపించాడు.
ప్రింటింగ్ ప్రెస్ (Printing Press) మంచి లాభాలను తెచ్చి పెట్టడడంతో ఆ తర్వాత కొన్ని రోజులకు అతని అన్నయ్య తో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ (Real Estate Business) చేసాడు. ఆర్ధికంగా ఎదిగిన తర్వాత అనాధలకు పెళ్లిళ్లు చేయించడం, సేవా కార్యక్రమాలు చేయడం, అభాగ్యులను ఆదుకోవడం లాంటి అనేక పనులు చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు గీతను రేవంత్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే, రేవంత్ రెడ్డి డిగ్రీ చేసే సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు. ఈయన పెళ్లి కి ముందు బిజినెస్ చేసి పెళ్లి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. రేవంత్ మాటలు తూటాల కన్నా చాలా పవర్ ఫుల్. రేవంత్ రెడ్డి ప్రసంగానికి వస్తే ప్రజలు టీవీకి అతుక్కుపోతారు. రేవంత్ రెడ్డి ని తన అభిమానులు టైగర్ అని కూడా పిలుచుకుంటారు.
ఒక మండల స్థాయి నుండి ఎన్నో ఓటములను ఎదురుకొని విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. తన రాజకీయం.. ప్రజలకు అండగా నిలిచి మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని అందరికీ ప్రయోజనాలు చేకూరాలని ఆశిద్దాం.