Telugu Mirror: దేశీయ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. SBI తన వినియోగదారులకు శుభవార్తను అందించింది. స్టేట్ బ్యాంకులో లోన్ తీసుకున్న అనేక మంది కస్టమర్లకు భారీ ఊరట కలిగించే ప్రకటన చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా లోన్ ల రికవరీ మీద తాత్కాలిక సిషేధం విధించినట్లు ప్రకటించింది. అయితే, ఈ సౌకర్యం అందరికీ వర్తించదు. కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా విధిస్తున్న లోన్ మారటోరియం, అల్లర్లు, హింసాకాండతో అట్టుడికి పోతున్న మణిపూర్ (Manipur) ప్రజలకు మాత్రమే లోన్ రికవరీ నిషేధం వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.
ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వింటూనే ఉన్నాం. అల్లర్లు చెలరేగి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు తున్నారు అక్కడి ప్రజలు. ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు ప్రజలు వణికిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఎస్‌బీఐ మణిపూర్ లోని తన కస్టమర్ లకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు SBI రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ లో మారటోరియం కూడా ఉంది. SBI విధించిన మారటోరియం వలన మణిపూర్ (Manipur) వ్యాప్తంగా ఎస్‌బీఐలో లోన్ పొందిన వారు సంవత్సరం పాటు (వచ్చే 12 నెలల వరకు) లోన్ ఈఎంఐ నుంచి వెసులుబాటు పొందొచ్చు. అంటే 12 నెలలు (ఏడాది పాటు) ఈఎంఐలు చెల్లించే అవసరం లేదు. ఈఎంఐ (EMI) మొత్తం, వడ్డీ చెల్లింపు, ఇతర వాయిదాల పై ఈ ప్రయోజనం పొందవచ్చు.
ఇదిలావుంటే.. ఎస్ బీఐ మణిపూర్ రీజనల్ ఆఫీస్ వారు జారీ చేసిన సర్క్యులర్ లో 2023, మే 3 వరకు ఈఎంఐ లు సక్రమంగా ఎవరైతే చెల్లిస్తున్నారో వారికి ఈ మారటోరియం వర్తిస్తుందని తెలిపింది.అలాగే ఎవరి అకౌంట్ అయితే 2923, మే 3 వరకు మొండి బకాయిగా ఉంటే అలాంటి వారికి మాత్రం ఈ లోన్ మారటోరియం వర్తించదని బ్యాంక్ విడుదల చేసిన సర్క్యులర్ లో వెల్లడించింది. ఈ రిలీఫ్ ప్యాకేజ్ కి అర్హులైన వారు తమ బ్యాంక్ యొక్క బ్రాంచ్ లకు వెళ్లి పొందవచ్చని తెలిపింది. ‘అల్లర్లు, హింసాకాండ ప్రజలపై తీవ్ర ప్రభావితం చూపిన కారణంగా మణిపూర్‌లోని రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ ప్రకటించిన ఉపశమన ప్యాకేజీ నిర్ణయం స్వాగతించే చర్య. ఈఎంఐలు, వడ్డీ చెల్లింపులపై తాత్కాలిక నిషేధం వారికి చాలా అవసరం. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఫైనాన్షియల్ గా వారి ఆర్థిక నిర్వహణలో మారటోరియం సహాయపడుతుంది. ‘ అని ఓ అధికారి తెలిపారు
అలాగే ఎస్‌బీఐ ఇటీవలే మరొక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఫిక్సెడ్ డిపాజిట్ పథకం అమృత కలశ్ (Amruth Kalash) యొక్క ఫిక్స్ డ్ డిపాజిట్ గడువును మరోసారి పొడిగించింది. ఆగస్టు15తో ఈ స్కీమ్ గడువు ముగిసింది. అయితే, మరొకసారి ఈ స్కీమ్ ను పొడిగిస్తూ 2023, డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చింది. అమృత్ కలష్ ఎఫ్ డి మెచ్యూరిటీ కాలపరిమితి 400 రోజులుగా ఉంది. ఎస్బీఐ అమృత్ కలశ్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో డబ్బులు డిపాజిట్ చేసే వారికి 7.6 శాతం వరకు గరిష్ఠ వడ్డీ వర్తిస్తుంది.