Surgery for men: 20 ఏళ్ల కుర్రాడి కడుపులో 13 హెయిర్ పిన్నులు, 5 సేఫ్టీ పిన్లు మరియు 5 రేజన్ బ్లేడ్లు ప్రత్యక్షం, సర్జరీ సక్సెస్
Telugu Mirror: మానసికంగా కుమిలిపోతున్న ఓ 20 ఏళ్ల కుర్రాడి కడుపులో నుంచి 13 హెయిర్ పిన్ లను,5 సేఫ్టీ పిన్ లను మరియు 5 రేజన్ బ్లేడ్ లను తీసేందుకు ఎండోస్కోపిక్ ప్రాసెస్ (endoscopic process) ను విజయవంతంగా పూర్తి చేసారని పుదుచేర్చి (puducherry) లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో పని చేసే వైద్య బృందం వాళ్ళు పేర్కొన్నారు. గ్యాసో ఎంటరాలజి మరియు మెడికల్ సెంటర్ ఆసుపత్రి (GEM ) బృందం తెలిపినది ఏంటి అంటే అతను విపరీతమైన కడుపు నొప్పి , రక్తపు వాంతులు మరియు వారానికి ఒకసారి అసాధారణమైన రంగు మలం అనే కారణాల చేత అతను అడ్మిట్ అయినట్టు తెలిపారు.
ఆ యువకుడు దీర్ఘ కాలంగా మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడని అతను వాటి కోసం టాబ్లెట్స్ ని కూడా వాడుతున్నాడని అధికారిక బృందం వెల్లడించింది. ఎండోస్కోపిక్ చికిత్స చేస్తున్న సమయం లో విదేశీ ఘన పదార్ధాలు లేదా గట్టిగా ఉన్న ద్రవ్య రాశిని కనుకొన్నట్లు తెలిపారు. ఆ వస్తువులు మొత్తాన్ని చుట్టుముట్టినట్టు తెలిపారు. దాన్ని “విదేశీ శరీర బేజోర్ ” అని పిలుస్తామని అది పేగుకి రంధ్రాలు పడే అవకాశం ఉందని వైద్య బృందానికి నాయకుడి గా ఉన్న GEM హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ K . శశికుమార్ (Dr. shasi kumar) వెల్లడించారు.
ఆ పేషెంట్ తల్లిదండ్రులకు కూడా ఓపెన్ సర్జరీ (open surgery) చేస్తే పని కాదని, ఎండోస్కోపిక్ ప్రాసెస్ చేసి ఆ విదేశీ పదునైన వస్తువులను తొలగించొచ్చు ఇంకా ఆ వస్తువులు పదునైనవి కాబట్టి సర్జరీ చేయడం క్లిష్టకరమైన పనే అని వైద్య బృందం లో ఒకరైన డాక్టర్ కె.సుగుమారన్ వివరించగా. వారు కూడా ఓపెన్ సర్జరీని కోరలేదని దానికి వ్యతిరేకించారని చెప్పారు. ఆ 20 ఏళ్ల యువకుడి ఘోష భరించలేక ఆగష్టు 7వ తేదీన ఆసుపత్రి కి తరలించగా ఆగష్టు 8వ తేదీన సర్జరీ పూర్తి చేసుకొని 9వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు.
ఆ పదునైన వస్తువుల వల్ల అంతర్గతంగా ఆ యువకుడికి ఏమి కాకపోవడం అతని అదృష్టం అని చెప్పవచ్చు. రెండు గంటల పాటు కొనసాగిన ఆ సర్జరీకి పేషెంట్ అనుకూలంగా స్పందించాడు. ఆ సర్జరీ విజయవంతం కావడానికి చేసిన ప్రయత్నం చాల గొప్పదని చెప్పవచ్చు. సర్జరీ సక్సెస్ కావడం తో అతని ప్రస్తుత ఆరోగ్యం పరవాలేదని ఆ యువకుడి ఆరోగ్యం కుదిటపడినట్టు అతను హాస్పిటల్ నుండి పంపించినట్టు తెలిపారు.
GEM హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ సి.పళనివేలు సవాలుతో కూడినటువంటి సర్జరీని విజయవంతంగా జరిపినందుకు బృందానికి అభినందనలు తెలిపారు.