Telangana Government : డ్వాక్రా మహిళలకు అదిరిపోయే న్యూస్, అదేమిటంటే?

Telangana Government

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం వేగంగా కృషి చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే పలు కీలక పథకాలను అమలు చేసిన సీఎం.. డ్వాక్రా మహిళలతో శుభవార్త పంచేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

మహిళలను సంపన్నులను చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ (Telangana Govt) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా శక్తిని బలపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వారి కోసం మీసేవ, ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో దాదాపు 1,050 మీసేవా కేంద్రాలు, ఆధార్ కేంద్రాలు అవసరమని సూచిస్తూ అధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. అయితే డ్వాక్రా మహిళలకు వీటిని పంపిణీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే, గ్రూప్ సభ్యులు అదనపు ఆదాయాన్ని పొందగలరు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వివిధ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఏ పేద కుటుంబానికి అన్యాయం జరగకూడదు లేదా ఎదుర్కోకూడదు అని ప్రభుత్వం భావిస్తుంది.

Telangana Government

సీఎం రేవంత్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పేద, బీపీఎల్ కుటుంబాలను అండగా నిలుస్తున్నారు. ప్రజాపాలన అభయహస్తం అనే అద్భుత కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు, సమాచారం సేకరించి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సులు, గృహ లక్ష్మి వంటి పథకాలను అమలు చేసారు.

ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పొడిగించడం, గ్యాస్ సిలిండర్లను రూ.500లకే అందించడం వంటి పథకాలకు మంచి మద్దతు లభిస్తోంది. త్వరలో కొత్త రేషన్‌కార్డులు అందజేసేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరగాలని, ఆయన పాలనలో నిరుపేదలు చిరునవ్వుతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఈ మేరకు అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తూ రేవంత్ పరిపాలన సాగిస్తున్నారు.

Telangana Government

Also Read : Pradhan Mantri Vishwakarma Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. కుట్టు మిషన్ ఇప్పుడు ఉచితంగా.. ఎలా పొందాలంటే?

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in