Zero Current Bill: రేషన్ కార్డు ఉంటే చాలు ఇక కరెంటు బిల్ జీరో, గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు వెలువరించింది. ఇది ప్రస్తుత లబ్ధిదారులకు కూడా సహాయం చేస్తుందా లేక రేషన్ కార్డులు లేని వారికి శుభవార్తనా అనేది ఇప్పుడు చూద్దాం.

Zero Current Bill: రేషన్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం అద్భుతమైన వార్తను అందించింది. రేషన్ కార్డులకు సంబంధించి రెండు కీలక తీర్పులు వెలువడ్డాయి. ఈ న్యూస్ చాలా మందికి ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? దీని వల్ల ఎవరికి లాభం? వంటి విషయాలు ఉన్నాయో తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు వెలువరించింది. ఇది ప్రస్తుత లబ్ధిదారులకు కూడా సహాయం చేస్తుందా లేక రేషన్ కార్డులు లేని వారికి శుభవార్తనా అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఇప్పటికే జీరో కరెంట్ బిల్లులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మందికి జీరో బిల్లులు కూడా వచ్చాయి. అంటే కరెంటు 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకుంటే జీరో బిల్ వస్తుంది. 200 యూనిట్ల వరకు ఎటువంటి ఛార్జీ పడదు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే, కొంత మంది వినియోగదారులకు బిల్లులు అందుతున్నాయి అని వార్తలు వచ్చాయి. అంటే జీరో బిల్లు రాకుండా గతంలో వచినట్టుగానే  కరెంటు బిల్ వస్తుంది. అటువంటి వారికి ప్రభుత్వం అద్భుతమైన వార్తలను అందించింది. కరెంట్ బిల్లు వచ్చినా రేషన్ కార్డులున్న వారు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంటే 200 యూనిట్లలోపు బిల్లును వినియోగించుకున్న కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

వివరాలు సరిగా ఇవ్వకుంటే 200 యూనిట్లలోపు విద్యుత్తుకు కూడా బిల్లులు ఇస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాంటి వారు బిల్లులు చెల్లించకుండా మండల పరిషత్‌, మున్సిపల్‌, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి రేషన్‌, ఆధార్‌ కార్డు, విద్యుత్‌ కనెక్షన్‌ వివరాలు అందజేస్తే మళ్లీ జీరో బిల్లు మంజూరవుతుందని తెలిపారు.

కాబట్టి మీరు 200 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ ని వినియోగించినా కూడా బిల్ వస్తే ఇకపై దిగులు చెందకండి. కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే స్థానిక మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మీ పథకాల ప్రయోజనాలను తిరిగి పొందవచ్చు. ఇంకా, రేషన్ కార్డులు లేని వారికి అద్భుతమైన వార్త ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డులపై మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డి సర్కార్‌ క్యాబినెట్‌ భేటీలో కొత్త రేషన్‌ కార్డుల అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు లేని వారికి సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం అన్ని పథకాలకు రేషన్ కార్డులను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

 Zero Current Bill

 

Comments are closed.