TTC Exam: ఉద్యోగ వృత్తిలోకి అడుగుపెట్టబోతున్న టీటీసీ టీచింగ్ కోర్స్ అభ్యర్థులు పరీక్ష రేపే.

Telugu Mirror: టెక్నికల్ టీచర్స్ విభాగం లో సమ్మర్ కోర్స్ ట్రైనింగ్ మే 1 నుండి మొదలై 42 రోజుల పాటు సాగిన కోర్స్ కు ఉద్యోగాలు సాధించే సమయానికి చేరువలో ఉన్నారు. ఈ శిక్షణను 5 జిల్లాలలో అనగా కరీంనగర్ , నిజామాబాద్ , నల్గొండ , హన్మకొండ మరియు హైదరాబాద్ లో 42 రోజుల పాటు కొనసాగింది. ఈ శిక్షణ కోసం నమోదు చేసుకునే ప్రక్రియ ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 30 వరకు కొనసాగిన విషయం మనందరికీ తెలిసిందే.

ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోడానికి ఏప్రిల్ 20 కల్లా తమ వయసు 18 ఏళ్ళు పూర్తిగా నిండి ఉండాలి మరియు 45 ఏళ్ళు మించకుండా ఉండాలి. అధిక చదువు లేకపోయినా చిన్న వయసులో ఉద్యోగం సాధించేందుకు సెకండరీ ఎడ్యుకేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉన్న పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థులు ఎవరైతే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారో , ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (SBTET) జారీ చేసిన ట్రేడ్‌లో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు (TCC) లేదా గుర్తింపు పొందిన ITIలు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (National Trade Certification) తప్పనిసరిగా ఉండాలి.

Tsttc exam conducting tomorrow in various districts in Telangana state
Image Credit: Getcets

 

Also Read:Change in life: జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు ‘మార్పు’ యొక్క పాత్ర ఏమిటో మీకు తెలుసా ?నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ వీవింగ్ సర్టిఫికెట్లు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ జారీ చేసిన సర్టిఫికెట్లు లేదా తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన సంగీత సర్టిఫికెట్లు లేదా దానికి అనుగుణమైన సర్టిఫికెట్లు కూడా అంగీకరించబడతాయి.
అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి అడ్మిషన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఒకవేళ తెలంగాణ రాష్ట్రము (Telangana State) కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబందించిన అభ్యర్థులు తమకు సంబందించిన అకాడమిక్ లేదా వారి టెక్నికల్ సర్టిఫికెట్స్ ను ఈ కోర్సులో ప్రవేశం పొందేందుకు ఒరిజినల్ సరిఫికేట్లతో కలిపి పరీక్షల డైరెక్టర్ కృష్ణ రావు దగ్గర అనుమంచి పొందాలని తెలుసు.

అయితే కోర్స్ పూర్తి చేసుకొని ఉద్యోగాలు సాధించాలనే ఆకాంక్షతో ఎదురు చూస్తున్న వారి సమయం దగ్గరికి వచ్చేసింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణా రావు (Telangana Government Exams Director Krishna Rao) శుక్రవారం TTC సమ్మర్ కోర్స్ ట్రైనింగ్ వారికి రాత పరీక్ష ఆగష్టు 27 నుండి ప్రారంభమవుతాయని వెళ్ళడించారు. రేపు జరగబోయే రాత పరీక్షలు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. పాఠశాల పరిపాలన మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ పై ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు , టీచింగ్ జనరల్ (Teaching General) వారికి 2PM నుండి 3PM వరకు , టీచింగ్ స్పెషల్ (Teaching Special) పద్ధతులు 3PM నుండి 4:30PM వరకు నిర్వహించనున్నారు.

www.bse.telangana.gov.in అధికారిక వెబ్సైటు లో అర్హులు ఐన అభ్యర్థులు హాల్ టిక్కెట్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

Leave A Reply

Your email address will not be published.